CSS Drop Down Menu

Wednesday, May 13, 2015

" మరకత లింగాన్ని పూజిస్తే అన్నీ శుభాలే" !

స్ఫటిక లింగానికి అభిషేకం చేయిస్తే సకల శుభాలు చేకూరుతాయని భక్తుల విశ్వాసం. అయితే మరకతలింగం అమూల్యం. మరి అలాంటి మహిమాన్వితమైన లింగాన్ని దర్శించుకోవాలంటే.. ఎలా.. అభిషేకం చేయాలంటే ఎలా అని కదూ.. అయితే చదవండి. భక్తులకు మరకతలింగం తమిళనాడులోని వేదారణ్యేశ్వర స్వామి ఆలయంలో ఉంది. మరకతలింగాన్నీ, శాస్త్రోక్తంగా పూజ చేయడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి.
 
అలాగే మరకత లింగం గల ఆలయాలు తమిళనాడులో తిరువారూర్‌లోని త్యాగరాజ ఆలయం, సుందరేశ్వరర్ ఆలయం ఇంకా వేదారణ్యంలోని మరైక్కాదనార్ ఆలయంలోనూ ఉన్నాయని పురోహితులు చెబుతున్నారు. అలాగే చెన్నైకి 37 కిలోమీటర్లు, కోల్ కతా హైవేస్‌లో శిరువాపురి అనే సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో స్వామి వాహనమైన నెమలి మరకతంతో తయారైంది. అందుకే ఈ ఆలయానికి చేరుకుని వేడుకుంటే మొక్కుబడులు తప్పకుండా నెరవేరుతాయని పండితులు అంటున్నారు.

0 comments:

Post a Comment