CSS Drop Down Menu

Friday, March 20, 2015

"పురుషులకు శుభవార్త "



పిల్లలు వద్దనుకునే మగాళ్ళు వేసెక్టమీ చేయించుకునేందుకు  ఇబ్బందులు పడుతుంటారు. అయితే త్వరలో అందుబాటులోకి రానున్న కొత్త ఇంజెక్షన్‌తో  వేసెక్టమీకి గుడ్ బై చెప్పొచ్చంటున్నారు  శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన డాక్టర్లు.  వేసెక్టమీ వద్దనుకుకునే వారికోసం కనిపెట్టిన వాసా జెల్‌ను ఇంజెక్షన్ ద్వారా బాడీలోకి పంపుతారు. ఇది వీర్యాన్ని మోసుకెళ్లే సన్నని ట్యూబ్‌ను  మూసివేస్తుంది.

మళ్ళీ అవసరం అనుకుంటే తేలిగ్గా ఈ జెల్‌ను తొలగించుకోవచ్చని డాక్టర్లు చెబుతున్నారు. ఇదే గనుక అందుబాటులోకి వస్తే.. ఇక పురుషులకు  సంతాన నిరోధకాల బాధ తప్పినట్టే! ఈ వాసాజెల్ ను ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నారు. సత్ఫలితాలొస్తే  వచ్చే ఏడాది మార్కెట్లో అందుబాటులోకి వస్తుంది.

0 comments:

Post a Comment