ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్‌గా
పట్టుబడి, విచారణ ఖైదీగా చర్లపల్లి జైల్లో ఉన్న రేవంత్ రెడ్డి తనను
ముందుంచి ఇరికించారంటూ కుటుంబ సభ్యులవద్ద వాపోయారు. పై స్థాయిలో ఒత్తిడి
తెచ్చి కనీసం బెయిలన్నా వెంటనే వచ్చేలా చూడలేదని ఆయన వ్యాఖ్యానించారట. తనను
కలిసేందుకు తెలుగుదేశం పార్టీ నేతలు వచ్చినా, ఆయన నిర్మొహమాటంగా
తిరస్కరించిన సంగతి తెలిసిందే.
దీంతో ఆయన అప్రూవర్‌గా మారతారా? అనే
సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసులో పూర్తి సాక్ష్యాధారాలు ఏసీబీ వద్ద
ఉండడంతో ఇక ఎటూ తప్పించుకోలేని పరిస్థితుల్లో అప్రూవర్‌గా మారి, తన వెనుక
ఉన్న 'పెద్దలు', సదరు 'బాస్' వివరాలూ చెప్పేందుకే మొగ్గు చూపుతున్నట్టు
తెలుస్తోంది. అలా చేయడం వల్ల తనను ప్రలోభపెట్టి ఈ పని చేసేందుకు
పురిగొల్పారని ఆయన వాదించుకోవచ్చు.
అంతేకాకుండా ఇలా చేయడం వలన తనపై బాస్‌లు
ఇరుక్కుంటారు కాబట్టి, తనపై కేసు తీవ్రతా తగ్గుతుందని రేవంత్
భావిస్తున్నట్టు సమాచారం. ఈ విషయాలు తెలుసుకున్న తెలుగుదేశం నేతలు
రేవంత్‌కు అండగా నిలిచి ఆయన్ను ఎలాగైనా సముదాయించాలని చర్లపల్లి జైలుకు
రాయబారాలు పంపుతున్నారని సమాచారం.
0 comments:
Post a Comment