1) ఇంటర్నల్ మెమరీ తక్కువుగా ఉందా?
పరిష్కారం: ఫోన్‌లో పేరుకుపోయి ఉన్న బ్రౌజింగ్ హిస్టరీతో పాటు క్యాచీలను తొలగించటం ద్వారా ఫోన్ ఇంటర్నల్ మెమరీని పెంచుకోవచ్చు.
2) బ్లూటూత్ పని చేయటం లేదా?
పరిష్కారం: ఫోన్‌ను స్విచ్ ఆఫ్ చేసి రిస్టార్ట్ చేయటం ద్వారా సమస్య పరిష్కారమయ్యే అవకాశముంది. బ్లూటూత్ షేర్ క్యాచీని తొలగించటం ద్వారా బ్లూటూత్ అంతరాయం లేకుండా పనిచేస్తుంది.
పరిష్కారం: ఫోన్‌లో పేరుకుపోయి ఉన్న బ్రౌజింగ్ హిస్టరీతో పాటు క్యాచీలను తొలగించటం ద్వారా ఫోన్ ఇంటర్నల్ మెమరీని పెంచుకోవచ్చు.
2) బ్లూటూత్ పని చేయటం లేదా?
పరిష్కారం: ఫోన్‌ను స్విచ్ ఆఫ్ చేసి రిస్టార్ట్ చేయటం ద్వారా సమస్య పరిష్కారమయ్యే అవకాశముంది. బ్లూటూత్ షేర్ క్యాచీని తొలగించటం ద్వారా బ్లూటూత్ అంతరాయం లేకుండా పనిచేస్తుంది.
3) బ్యాటరీ బ్యాకప్ త్వరగా తగ్గిపోతోందా?
పరిష్కారం: ఫోన్‌లోని కనెక్టువిటీ ఫీచర్లుతో పాటు బ్యాక్ గ్రౌండ్ అప్లికేషన్‌లను నిలిపి వేయటం ద్వారా బ్యాటరీ బ్యాకప్‌ను పెంచుకోవచ్చు.
4) ఆండ్రాయిడ్ ఫోన్ మెమరీ కార్డును గుర్తించటం లేదా?
పరిష్కారం: సదరు మెమరీ కార్డును ఫార్మాట్ చేయటం ద్వారా సమస్య పరిష్కారమవుతుంది. ఇలా చేయాలంటే.. Go to settings > Storage > Format SD card > Ok
5) ఫోన్ సిమ్‌కార్డ్‌ను గుర్తించటం లేదా?
పరిష్కారం: ముందుగా వేరే సిమ్‌లను వేసి ప్రయత్నించిండి. ఒకవేళ సమస్య మీ సిమ్ కార్డ్‌లో ఉంటే పరిష్కరించుకోవచ్చు. మీరు అడాప్టర్‌తో కూడిన మైక్రోసిమ్‌ను వినియోగిస్తున్నట్లయితే నానో సిమ్‌గా మార్చి ప్రయత్నించండి.
6) కెమెరా స్టార్ట్ అవటం లేదా?
పరిష్కారం: ముందుగా సెట్టింగ్స్‌లోని యాప్స్ మెనూలోకి ప్రవేశించి కెమెరా యాప్‌ను సెలక్ట్ చేసుకోండి. కెమెరా యాప్ ఓపెన్ అయిన తరువాత ‘Force stop' ‘clear data', ‘clear cache' ఆప్షన్‌లను ‘Apply' చేయండి. చాట్ మెసెంజర్స్ వంటి థర్డ్ పార్టీ యాప్స్ కూడా ఈ సమస్యకు కారణం కావచ్చు. కాబట్టి కెమెరాను యాప్‌ను రీఇన్‌స్టాల్ చేసే ముందు ఓసారి వాటిని తొలగించి చూడండి. సమస్యకు పరిష్కారం లభించవచ్చు.
7) బ్యాటరీ చార్జ్ అవటనాకి ఎక్కువ సమయం పడుతోందా?
పరిష్కారం: మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లోని బ్యాటరీ పూర్తిగా చార్జ్ అవటానికి ఎక్కువ సమయం తీసకుంటుందా..? అయితే ఇది హార్డ్‌వేర్ సమస్యే, చార్జర్‌కు సంబంధించిన యూఎస్బీ కేబుల్‌ను మార్చటం ద్వారా ఈ సమస్యను పరిష్కరించవచ్చు.
8) ఫోన్ హ్యాంగ్ అయిన సమయంలో ఏం చేయాలి ?
పరిష్కారం: రీస్టార్ట్ చేయటం ద్వారా ఫోన్ ను సాధారణ స్థితికి తీసుకురావచ్చు. తరచూ ఇలాను జరుగుతున్నట్లయితే ఖచ్చితంగా ఫోన్ సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేయవల్సిందే.
0 comments:
Post a Comment