ఎన్నికల కమిషన్ తెలంగాణ ఏసీబీని గో అహెడ్ అన్నట్లు వార్తలు వచ్చిన దగ్గర్నుంచి తెలుగుదేశం పార్టీ వెన్నులో వణుకు పుడుతోందన్న ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారనీ, కార్యకర్తలు, నాయకులలో మనోస్థైయిర్యం దెబ్బ తినకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. మరోవైపు ఓటుకు నోటు వ్యవహారంలో తనను తెలంగాణ ఏసీబీ అదుపులోకి తీసుకొంటే? అనే ప్రశ్న ఆయనను వెంటాడుతోందని భోగట్టా. కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వడం ఆయనను విచారించడం తరువాతి సంగతి. తాను ఏసీబీకి సంజాయిషి ఇవ్వాల్సి వస్తే...? బాబు రాజీనామా చేయక తప్పదు. అప్పుడు సిఎం ఎవరు? దీనిపై బాబు ఓ వైపు ఆలోచనలు చేస్తున్నట్లు సమాచారం. భార్య భువనేశ్వరిని రంగంలోకి దింపితే ఎలా ఉంటుందనే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
ఎన్ని నోటీసులు వచ్చినా లెక్కజేయం అంటూ అచ్చెన్నాయుడు వంటి వారు ప్రకటనలు చేస్తున్నా.. బాబు మాత్రం రాజీనామా చేసే అంశాన్ని కొట్టేయలేదని తెలుస్తోంది. ఎందుకంటే కాపాడాల్సిన కేంద్ర ప్రభుత్వం సుష్మ స్వరాజ్, వసుంధరా రాజె సంఘటనతో పీకల్లోతు కష్టాల్లో ఇరుక్కుపోయింది.ఇప్పటికిప్పుడు భారతీయ జనతా పార్టీ పెద్దగా ఇటువైపు చూసే అవకాశం లేదు. మరోవైపు ఈసీ ఇప్పటికే తెలంగాణ ఏసీబీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని అంటున్నారు. దీంతో ఏ సమయంలోనైనా ఏసీబీ నోటీసులు ఇవ్వవచ్చు. ఇలాంటి పరిస్థితులలో రాజీనామా ఖాయం అనే ప్రచారం జరుగుతోంది.
మరి బాబు రాజీనామా చేస్తే తదుపరి ముఖ్యమంత్రి ఎవరు? అశోక్ గజపతి రాజు, నారాయణ, బాలకృష్ణ.. వంటి వారి పేర్లు వినిపించినా.. వారెవరూ కాదు, నారా భువనేశ్వరిని ప్రిపేర్ చేస్తున్నారట. గతంలో బీహార్ లల్లూ సంఘటనను పరిగణలోకి తీసుకుని చంద్రబాబు భార్య నారా భువనేశ్వరినే ముఖ్యమంత్రిగా నిలబెట్టే అవకాశం ఉందనే వాదనలు వినబడుతున్నాయి. లోకేష్‌ను పెడితే సీనియర్లుకు గుర్రు.. పోనీ బాలకృష్ణను పెడదామంటే ఈ రాజకీయాలలో తట్టుకోగలరా.. అనేది అనుమానం. అశోక్ గజపతి రాజు పేరు వినిపిస్తున్నా.. ఆయనకంటే బెటర్ క్యాండిడేట్ తన భార్య భువనేశ్వరే అనే భావనకు వచ్చినట్లు చెపుతున్నారు.
ఎన్టీఆర్ కూతురు.. బాలయ్యకు అక్క.. తనకు భార్య ఇలా అన్ని సెంటిమెంట్లు కలిసి వస్తాయి. అందుకే బాబు ఆమెనే గద్దెనెక్కించాలని అనుకొంటున్నారని సమాచారం. మరి బాబు ఎప్పుడు రాజీనామా చేస్తారనే అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు నోటీసులకు ముందు కావచ్చు.. నోటీసుల తరువాత కావచ్చు.. రాజకీయ అనుకూలత, లబ్ధిని అనుసరించి నిర్ణయం తీసుకుంటారట. చూద్దాం... ఈ ప్రచారాల పరంపర ఎంతవరకు వెళుతుందో...?

0 comments:
Post a Comment