బాలీవుడ్‌లో హాట్ బ్యూటీగా వెలుగుతున్న
సుందరి పూనం పాండే. గత 2011లో ఇండియా ప్రపంచ కప్ గెలిస్తే నగ్నంగా
కనిపిస్తానని బహిరంగ ప్రకటన చేసి అందరి దృష్టిని ఆకర్షించిన అమ్మడు, ఆ
తర్వాతి ఏడాది కొలకత్తా నైట్ రైడర్స్ ఐపిఎల్‌లో విజేతలుగా నిలిచినప్పుడు
ఆమె తన ఆనందాన్ని వ్యక్తపరుస్తూ అర్ధనగ్న ఫోటోలని ట్విట్టర్‌లో పోస్ట్ చేసి
హంగామా సృష్టించింది.
హాటీ బ్యూటీగా ఎంత పేరున్నప్పటికీ, ఇంకా
పాపులర్ కావాలనే తపనతో ఎప్పుడూ మీడియాలో హాట్ టాపిక్‌గానే కొనసాగుతూ
ఉంటుంది. తాజాగా పూనం తన సరసన నటించేందుకు కొత్త కుర్రాళ్ళ ఎంపికపై ఫోకస్
పెట్టింది. తన సరసన నటించే ఛాన్స్ ఎవరు దక్కించుకుంటారు అంటూ ఓ వీడియో
తయారు చేసి యుట్యూబ్లో పోస్ట్ చేసింది.
అంతే ఇంకేముందు నేనంటే నేను అంటూ 25 వేల
మంది యువకులు తమ యాక్టింగ్ స్కిల్స్ చూపిస్తూ తాము పూనమ్‌తో రొమాన్స్
చేయడానికి సిద్ధం అంటూ పూనంకు వీడియోలు పంపించారు. ఇన్ని వేలమందిలో తనతో
రొమాన్స్ చేసే హీరోని ఎలా ఎంచుకుకోవాలని తలపట్టుకుంది పూనమ్.
0 comments:
Post a Comment