CSS Drop Down Menu

Tuesday, June 30, 2015

"చిలుక మనిషిలా ఎలా మాట్లాడగలదో" కనిపెట్టేసారు!

సినిమాల్లోనూ, చిలక జోస్యం చెప్పేవారి దగ్గర కూడా రామచిలుకలు చిన్నచిన్న మాటలు మాట్లాడటం చూసే ఉంటాం. కొంతమంది ఇళ్లలో అయితే పెంపుడు చిలుకలు ఏకంగా మనం ఏది మాట్లాడితే అది కూడా అలాగే మాట్లాడేస్తుంది. కాకపోతే స్పష్టత లేకపోయినప్పటికీ ధ్వని మాత్రం మనం చెప్పిన మాటలను పోలి ఉంటుంది. అసలు రామచిలుక మనిషిలా ఎలా మాట్లాడగలుగుతోంది...? మిగిలిన జీవరాశులు మనిషిలా మాట్లాడలేకపోతున్నాయి కదా.
 
  వీటికి మాత్రమే అంత తెలివి ఎక్కడిది... ఎలా మాట్లాడగలుగుతున్నాయి అనే ప్రశ్నలపై అధ్యయనకారులు ఎప్పటి నుంచో పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. ఈమధ్య నెథర్లాండ్స్, డెన్మార్కులకు చెందిన కొందరు పరిశోధకులు దీనిపై చేసిన పరిశోధనల్లో అసలు సంగతేమిటో వెలుగుచూసిందట. అదేమంటే... రామచిలుకల మెదడు ఇతర పక్షుల మాదిరి కాకుండా కొంత వైవిధ్యంగా ఉన్నట్లు కనుగొన్నారు. 
 
నిజానికి రామచిలుక మెదడు గురించి ఎన్నో ఏళ్ల క్రితం తెలుసుకున్నప్పటికీ, చిలుక ఎలా మాట్లాడగలుగుతుందనే కోణంలో దానిని పరిశీలించలేదు. తాజాగా ఈ కోణంలో పరిశీలించిన పరిశోధకులకు కొన్ని ఆసక్తికర అంశాలు బయటకు వచ్చాయట. మనిషి చెప్పే మాటలను గ్రహించే శక్తి చిలుక మెదడుకు ఉన్నట్లు కనుగొన్నారు. అందువల్లనే చిలుక మనం మాట్లాడే మాటలను తిరిగి మాట్లాడగలుగుతుందని చెపుతున్నారు.
 


0 comments:

Post a Comment