మనషి శరారీనికి వ్యాయామం ఎంతో మేలు
చేస్తుందనే విషయం అందరికీ తెలిసిందే. ప్రతి రోజు అర గంట నుంచి ఒక గంట పాటు
వ్యాయం చేయడం వలన హుషారుగా ఉండడమే కాకుండా ఆరోగ్యంగానూ ఉంటారు. అయితే అదే
వ్యాయామం అధికమైతే మాత్రం ప్రమాదమేనట. ఆస్ట్రేలియాకు చెందిన ఆరోగ్య
నిపుణులు ఇటీవల మనిషి వ్యాయామంపై పరిశోధనలు చేసి నివేదికను వెల్లడించారు.
దాని ఆధారంగా చూస్తే.. వ్యాయామం అధికంగా
చేయడం వలన ప్రేగుల నుంచి విడుదలయ్యే హానికర బ్యాక్టీరియా రక్తంలో
కలుస్తుందని, ఇది ప్రమాదకరమని తెలుస్తోంది. ఈ బ్యాక్టీరియా అధిక మొత్తంలో
రక్తంలో కలవడం వల్ల వ్యాధి నిరోధక శక్తికి ప్రతిబంధకాలు ఏర్పడతాయట. పూర్తి
ఆరోగ్యవంతులపై పరిశోధనలు జరిపి ఈ వివరాలను వెల్లడించారు. కాబట్టి వ్యాయం
కూడా మితంగా చేయడం మంచిదన్నమాట.
0 comments:
Post a Comment