CSS Drop Down Menu

Monday, June 15, 2015

లైంగిక సామర్థ్యం పెరగాలంటే ?

మానసిక ఒత్తిడి క్షణ క్షణానికి ఎక్కువ అవుతున్న ఈ రోజుల్లో లైంగిక సామర్థ్యం ప్రశ్నార్థకంగా మారుతోంది. చాలా సంసారాలు చిన్నాభిన్నమవుతున్నాయి. ఇలాంటి సమయంలో లైంగిక సామర్థ్యాన్ని పెంచుకోవడానికి తిండిలో మార్పులు చేసుకోవాలని వాటి ద్వారా మాత్రమే ఆ.. సామార్థ్యం పెరుగుతుందని శాస్త్రవేత్తలు బల్లగుద్ది చెబుతున్నారు. 
 
పురుషులలో శక్తిని పెంచడానికి ముఖ్యంగా విటమిన్‌ ఇ చాలా ఉపయోగపడుతుంది. లైంగిక సామర్థ్యం తక్కువగా ఉన్న వారు ప్రతి రోజు మంచి ఆహారంతో పాటు విటమిన్‌ ఇ కాప్యుల్స్‌ను కూడా తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సరియైన ఆహారం తీసుకుంటే దాంపత్యం సవ్యంగా సాగుతుందని భరోసా ఇస్తున్నారు. 
 
లైంగిక సామర్థ్యాన్ని పెంచే ఆహార పదార్థాలలో తులసి, లవంగం, టమాట, ముల్లంగి, కోడిగుడ్డు, క్యారట్‌, పిల్లితీగలు, అల్లం, ఉల్లి, దోసకాయ, ఎర్రమిరియాలు, ఓట్లు, పిస్తా, చెస్ట్‌నట్‌, హాజల్‌నట్‌, కొబ్బరి, పుట్టగొడుగు ముఖ్యమైనవి. ముఖ్యంగా విటమిన్‌ ఇ ఉండే బాదం, వాల్‌నట్‌లు లైంగిక సామర్థ్యం పెరగడంలో అద్భుతంగా ఉపయోగపడుతాయంటున్నారు. దివ్య ఔషధంలా పని చేస్తాయట. 

అంతే కాదండోయ్... లైంగిక శక్తికి ఎరుపు రంగుకు సంబంధం ఉందని కూడా పరిశోధకులు వివరిస్తున్నారు. ఎరుపు రంగులో ఉండే పదార్థాలు, డ్రింక్స్‌ తీసుకుంటే లైంగిక సామర్థ్యం వృద్ధి చెందుతుందని అంటున్నారు. పగడం , రూబీ స్టోన్‌లు శక్తిని పెంచడంలో సహాయపడతాయని అందుకే వాటిని ధరించమని సూచిస్తుంటారు.

0 comments:

Post a Comment