మన దేశంలో సాధారణంగా ఉద్యోగం చేసే మహిళలకు
ప్రసవం కోసం మెటర్నటీ లీవ్ ఇస్తారు. అయితే ఆ దేశంలో మాత్రం పురుషుడు
తండ్రయితే బంపర్ ఆఫర్ తగిలినట్టే, ఏడాది సెలవు ఇవ్వడంతో పాటు 20 శాతం జీతం
కూడా సంస్థ తిరిగి ఇస్తుంది. వివరాల్లోకి వెళితే.. యూకేలోని ‘వర్జిన్' అనే
సంస్థ మాత్రం మగవాళ్లకు బంపర్ ఆఫర్ ఇస్తోంది. తండ్రి అయితే పూర్తి జీతంతో
కూడిన ఏడాది సెలవు మంజూరు చేయాలని నిర్ణయించింది.
అయితే అందుకు ఆ సంస్థలో నాలుగేళ్ల సర్వీసు
పూర్తి చేసి ఉండాలని అర్హతను నిర్ణయించింది. యూకేలోని వర్జిన్ గ్రూప్‌కు
చెందిన ఇన్వెస్ట్‌మెంట్ అండ్ బ్రాండ్ లైసెన్సింగ్ సంస్థ ఉంది. ఈ సంస్థకు
యూకేతోపాటు ఇతర దేశాల్లో కూడా శాఖలు ఉన్నాయి. సుమారు 50వేల మంది ఉద్యోగులు
సంస్థలో పని చేస్తున్నారు.
అయితే యూనైటెడ్ కింగ్‌డమ్, జెనీవా శాఖల్లో
పనిచేసే ఉద్యోగులకు మాత్రమే ఈ ఆఫర్‌ను వర్తింపజేస్తూ కంపెనీ నిర్ణయం
తీసుకుంది. వీరిలో నాలుగేళ్ల సర్వీసు లేకపోయినా, కనీసం రెండు సంవత్సరాల
కాలం అయినా పని చేసి ఉండాలి. అలా రెండేళ్లు పనిచేసిన ఉద్యోగులకు ఏడాది
సెలవు, 25శాతం జీతం చెల్లించనున్నట్లు సంస్థ తెలిపింది.
కేవలం బిడ్డల్ని కంటేనే కాదట, దత్తత
తీసుకున్నా ఈ సెలవు, జీతం వర్తిస్తాయని సంస్థ ప్రకటించడం కొసమెరుపు. తండ్రి
అయిన తర్వాత ఇంటి నుంచి బయటకు రావాలంటే చాలా బాధగా ఉంటుందని, ఆ బాధను తాను
అనుభవించానని, అలాంటి బాధ తన సంస్థలో పని చేసే ఉద్యోగులు అనుభవించకూడదనే ఈ
ఆఫర్ ఇచ్చినట్లు వర్జిన్ గ్రూప్ అధినేత బ్రాన్సన్ తెలిపారు.
0 comments:
Post a Comment