CSS Drop Down Menu

Wednesday, June 17, 2015

మీరు "ఇష్టపడే ఐస్ క్రీం"ను బట్టి మీ "వ్యక్తిత్వం" తెలిసిపోతుంది ?

మనిషి వ్యక్తిత్వాన్ని నిర్ణయించేందుకు ఇన్నాళ్లు జాతకాలు, పంచాంగాలు చూసేవారు. తాజాగా వ్యక్తి ఇష్టపడే తినే ఐస్ క్రీం‌ను బట్టి కూడా ఆ వ్యక్తి ఎటువంటి వాడు, అతని గుణం, స్వభావం ఎలాంటిది, అనే విషయాలను తెలుసుకోవచ్చునట. ఈ విషయం వెబ్‌ సైట్‌లలో హల్‌చల్ చేస్తున్న ఈ ఆర్టికల్‌ను బట్టి తెలుస్తుంది. సాధారణంగా ఐస్ క్రీం ఇష్టపడని వారుండరంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం ఇష్టపడి తినే ఆహార పదార్థాల జాబితాలో టాప్-5లో ఐస్ క్రీం తప్పనిసరిగా ఉండి తీరుతుంది. అది ఏ ఫ్లేవరైనా కావచ్చు. 
 
అయితే, ఇష్టమైన ఐస్ క్రీం ఫ్లేవర్ ఏంటో చెబితే, వారు ఎలాంటివారో తెలిసిపోతుందట. మీరు వెనీలా ఇష్టపడే వారైతే కొత్త ప్రయోగాలు చేసేందుకు ఉత్సుకత చూపుతారట. జీవితానికి ఇంకేదో జోడించాలనే తాపత్రయం మీలో ఉంటుందట. చిన్న చిన్న విజయాలకు పెద్ద ఆత్మసంతృప్తిని పొందుతారట.
 ఇక చాక్లెట్ ఫ్లేవర్ ఇష్టపడే వారుగా ఉంటే తనకు మించి మరెవరూ లేనట్లు భావిస్తుంటారట. అంతే కాకుండా అటువంటి వారు ఎప్పుడూ చాలా స్మార్ట్‌గా, అందంగా కనిపించడానికి, చుట్టూ ఉన్నవారు ఇష్టపడేలా ఉండాలని కోరుకుంటారట. 

కాఫీ ఫ్లేవర్ ఇష్టపడేవారు కొత్త కొత్త పనులు మొదలు పెట్టడానికి ఇష్టపడుతుంటారట. అయితే వాటిని పూర్తి చెయ్యడంలో మాత్రం అలసత్వం చూపుతారట.
 ఇక స్ట్రాబెరీ ఇష్టమైతే, ఎల్లప్పుడూ ప్రశాంతంగా కనిపిస్తారట. ప్రపంచంతో సంబంధం లేకుండా తమదైన జీవనం గడుపుతూ, రిజర్వుడుగా, కాస్తంత సిగ్గుపడుతూ, ఇష్టమైన నేతను అనుసరిస్తూ ఉంటారట.
 
బటర్ స్కాచ్ ఇష్టపడుతున్నట్లయితే, తోటివారందరితో పోలిస్తే, కనీసం ఒక్కసారన్నా 'బెస్ట్' అనిపించుకుంటారట. హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారట. ఫోన్ల ద్వారా మెసేజ్ పెట్టడం కంటే, ఒకసారి స్వయంగా మాట్లాడితేనే మేలు కలుగుతుందని భావిస్తారట.
 ఇందులో ఎంత మాత్రం నిజముందో తెలియదుగానీ, నెటిజన్లు మాత్రం మీడియాలో వెలువడిన ఈ ఆర్టికల్‌ను చూసి తమకు తాముగా పరీక్షించుకుంటున్నారు. మీరు ట్రై చేయండి.


0 comments:

Post a Comment