రాష్ట్రాన్ని పరిశుభ్రంగా
తీర్చిదిద్దడానికి నడుంకట్టిన గుజరాత్ ప్రభుత్వం పలు విధాలైన కొత్త
పద్దతులను అమలుచేస్తోంది. అందులో భాగంగా తాజాగా మరో వినూత్న పథకాన్ని
ప్రారంభించింది. 'రూపీ ఫర్ పీ' పేరిట సులభ్ కాంప్లెక్సుల్లో మూత్ర విసర్జన
చేసే వారికి ఒక రూపాయిని గిఫ్ట్‌గా ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో ముఖ్య
ప్రాంతాలు, కూడళ్లలో ఉన్న 67 కాంప్లెక్సుల వద్ద ఈ పథకాన్ని అమలుచేన్నామని
తెలిపింది.
వచ్చే స్పందనను బట్టి త్వరలో మరిన్ని
ప్రాంతాలకు ఈ పథకాన్ని విస్తరిస్తామని అధికారులు వెల్లడించారు. పబ్లిక్
టాయిలెట్స్ వినియోగంపై ప్రజల్లో, ముఖ్యంగా మురికి వాడల్లో నివసిస్తున్న
వారిలో అవగాహన తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రారంభించామని, చాలా
వరకు స్లమ్ ఏరియాల్లో ఈ రూపాయి స్కీం మొదలైందని మునిసిపల్ అధికారి ఒకరు
వివరించారు.
0 comments:
Post a Comment