సినిమాల్లోనూ, చిలక జోస్యం చెప్పేవారి దగ్గర
కూడా రామచిలుకలు చిన్నచిన్న మాటలు మాట్లాడటం చూసే ఉంటాం. కొంతమంది ఇళ్లలో
అయితే పెంపుడు చిలుకలు ఏకంగా మనం ఏది మాట్లాడితే అది కూడా అలాగే
మాట్లాడేస్తుంది. కాకపోతే స్పష్టత లేకపోయినప్పటికీ ధ్వని మాత్రం మనం
చెప్పిన మాటలను పోలి ఉంటుంది. అసలు రామచిలుక మనిషిలా ఎలా
మాట్లాడగలుగుతోంది...? మిగిలిన జీవరాశులు మనిషిలా మాట్లాడలేకపోతున్నాయి
కదా.
వీటికి మాత్రమే అంత తెలివి ఎక్కడిది... ఎలా
మాట్లాడగలుగుతున్నాయి అనే ప్రశ్నలపై అధ్యయనకారులు ఎప్పటి నుంచో పరిశోధనలు
చేస్తూనే ఉన్నారు. ఈమధ్య నెథర్లాండ్స్,...