CSS Drop Down Menu

Tuesday, April 7, 2015

"గ్రీన్ టీ" లో " షుగర్" వేసుకొంటున్నారా ?

గ్రీన్ టీకి ప్రస్తుతం యమా క్రేజ్. టెక్నాలజీ పేరిట గంటల పాటు కంప్యూటర్ల ముందు కూర్చుంటూ.. ఒబిసిటీకి దగ్గరవుతున్న అనేక మంది గ్రీన్ టీని తీసుకుంటున్నారు. గ్రీన్ ప్రస్తుతం అనేక ఫ్లేవర్స్‌లో వస్తున్నాయి. అయితే గ్రీన్ టీని పంచదార కలిపి తీసేసుకోవడంలో ప్రయోజనం లేదంటున్నారు ఆరోగ్య నిపుణులు. 
 
గ్రీన్ టీని షుగర్ వేసి తీసుకోకూడదు. గ్రీన్ టీ ప్రకాశవంతంగా ఉత్సహాకరంగా మార్చడానికి సహాయపడుతుంది. కాబట్టి, పంచదార్ గ్రీన్ టీకి ఫర్ ఫెక్ట్ ఐడియల్ కాంబినేషన్ కాదు. గ్రీన్ టీకి ఒక మంచి కాంబినేషన్ కొద్దిగా నిమ్మరసం లేదా కొద్దిగా తేనె వేసుకుంటే సులభంగా బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
 
ఈ కాంబినేషన్‌లో గ్రీన్ టీని తీసుకుంటే ఖచ్చితంగా ఒత్తిడి దూరమవుతుంది. గ్రీన్ టీతో పాటు తేనె మిక్స్ చేసి తీసుకోవడం వల్ల మెదడు పనితీరు మెరుగవుతుంది. ఫ్యాట్‌ను కరిగిస్తుంది. క్యాన్సర్ కణాలను నశింపజేస్తుంది. డెంటల్ హెల్త్‌ను మెరుగుపరచడంతో పాటు.. ఎముకల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
 

0 comments:

Post a Comment