“ఒక్కో ఎమ్మెల్యే ఎన్నికలలో గెలవడానికి రూ.15 కోట్లు ఖర్చుపెట్టారు.”
ఇది కొత్త విషయమా… అని అనిపిస్తుంది. కానీ, ఇది ఎన్నికల్ కమిషన్
వెల్లడించడం మాత్రం కచ్చితంగా కొత్త విషయమే. ఎమ్మెల్యేలు ఇచ్చే రశీదులు
పక్కన పెట్టి ఎన్నికల కమిషన్ వేసిన నిఘాలో తేలిన లెక్క అట ఇది. ఇంతకీ ఇపుడు
ఎందుకు ఈ నిజాన్ని బయట పెట్టారంటే… ఎన్నికలలో సంస్కరణలపై తాజాగా ఒక సదస్సు
జరిగింది. ఆ సందర్భంగా అంతర్గత రిపోర్టులను బయటపెట్టారు. మరి తెలిసి
ఎందుకు ఊరుకున్నారంటే… నిఘా వేరు, దర్యాప్తు వేరు… పైగా దీన్ని ఒక్క
రోజులోనో, ఒక ఏడాదిలోనో కంట్రోల్ చేయలేం. ప్రజలు మారాలి, అభ్యర్థులు
మారాలి, అధికారులు మారాలి…అపుడే దీన్ని అరికట్టొచ్చు అని హెచ్ఎస్ బ్రహ్మ
వ్యాఖ్యానించారు.
ఇంకో విషయం… ఈ పదిహేను కోట్లు సగటు లెక్క. ఒక్కోదాన్నీ లెక్కేస్తే ఆ కథే వేరుంటుంది.
0 comments:
Post a Comment