CSS Drop Down Menu

Monday, April 13, 2015

"అలీ" కి "సమంత వార్నింగ్"

హాస్య నటుడు అలీ అగ్లీ టాక్స్ ఎంతమాత్రం ఆగడం లేదు. ఆ మధ్య యాంకర్ సుమను స్టేజిపైనే ఇబ్బందిపెట్టిన అలీ, సన్నాఫ్ సత్యమూర్తి సక్సెస్ కార్యక్రమంలో తన అగ్లీ టాక్‌ను మరోసారి బయటపెట్టేశాడు. ఈ చిత్రంలో సమంత గ్లామర్‌ను అలీ తెగ పొగిడేశాడు. సమంత ఓ ఏరియా అందాన్ని బెంజ్ సర్కిల్ అంటూ వ్యాఖ్యానించాడు.
 
సమంత గ్లామర్ అంటే తనకు చాలా ఇష్టమనీ, ముఖ్యంగా ఆమె బెంజ్ సర్కిల్... అంటూ తన నడుము భాగం నుంచి కింద పిరుదులకు మధ్యన ఉన్నది బెంజ్ సర్కిల్ లా కనబడతుందంటూ వ్యాఖ్యానించాడు. 
 
అలీ వ్యాఖ్యలపై అభిమానులు అసంతృప్తి వ్యక్తంచేయగా, సమంత కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. సమంత ఫోన్ చేసి అలీపై మండిపడిందట. తన గురించి మరోసారి అలా మాట్లాడితే బాగుండదు అంటూ గట్టిగా చెప్పినట్లు టాలీవుడ్ టాక్. కాగా గతంలో పలు ఆడియో వేడుకల్లో కూడా అలీ ఇటుంటి వ్యాఖ్యలు చేశారనే విమర్శలు ఉన్నాయి.

0 comments:

Post a Comment