CSS Drop Down Menu

Tuesday, April 14, 2015

దుస్తులను ఎంపిక చేసే 'రీమిక్స్' యాప్ !

ఆధునిక ప్రపంచంలో అన్నీ సులభతరమయ్యాయి. ఒక్క చోట ఉండే ఒకే వ్యక్తి ఆన్‌లైన్‌లో అన్ని పనులు పూర్తి చేసుకోవచ్చు. అయితే డ్రెస్సింగ్ విషయంలో మాత్రం అలా ఉండదు. మనం సెలెక్ట్ చేసే దుస్తులు మనకు సెట్టవుతాయో లేదో అనే విషయం ఇతరులను అడిగి తెలుసుకోవాల్సి ఉంటుంది.
 
అయితే ప్రస్తుతం ఆ అవసరం కూడా ఆధునిక టెక్నాలజీ తీర్చనుంది. అందుకోసం స్మార్ట్ ఫోన్ యాప్ సేవలందిస్తున్న పాలీవోర్ తాజాగా 'రీమిక్స్' పేరిట సరికొత్త యాప్ విడుదల చేసింది. దీన్ని వాడి యూజర్లు తమకు ఎటువంటి దుస్తులు సెట్టవుతాయి, మార్కెట్లో ఎక్కువగా అమ్ముడవుతున్న వెరైటీ  డ్రెస్‌లు, తదితర వివరాలను తెలుసుకోవచ్చని పాలీవోర్ తెలిపింది. 
 
ఈ యాప్ లో ట్రెండింగ్, ఫైండ్, మై ఫేవ్స్ అంటూ మూడు సెక్షన్ లు మాత్రమే ఉంటాయని వివరించింది. అంతేకాకుండా ట్రెండింగ్ పేజిలో ఎప్పటికప్పుడు అప్ డేట్స్ చూసుకోవచ్చని, తద్వారా ప్రతి రోజు మార్కెట్‌లో  మారుతుండే డిజైన్ స్టైల్స్ కు అనుగుణంగా దుస్తులను ఎంచుకోవచ్చని తెలిపింది. 
 
ఫైండ్ సెక్షన్ లో నచ్చిన దుస్తులు సమీపంలో ఎక్కడ లభిస్తాయో కూడా తెలుసుకోవచ్చని పేర్కొంది. నచ్చిన డిజైన్లను మై ఫేవ్స్ లో సేవ్ చేసుకోవచ్చని పాలీవోర్ వివరించింది.



0 comments:

Post a Comment