శంకర్ దర్శకత్వంలో త్వరలో ఒక సినిమా
రానుందట. అందులో సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరో అయితే కమల్ హాసన్ విలన్‌గా
నటించనున్నారని సమాచారం. ప్రస్తుతం ఈ వార్త కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా
హల్‌చల్ చేస్తోంది.
కోలీవుడ్ బిగ్ హీరోలు సూపర్ స్టార్స్
రజనీకాంత్, కమల్ హసన్. వీరిద్దరూ దాదాపు ఒకేసారి సినీ కెరీర్
ప్రారంభించారు. అంతేకాదు తెరపై కూడా ఒకే సారి స్టార్లుగా ఎదిగారు. మొదట్లో
ఇద్దరు కలసి కొన్ని సినిమాలు చేసినప్పటికీ, అనంతరం ఏర్పడిన వ్యక్తిగత
ఇమేజ్‌లతో మళ్ళీ కలసి నటించలేదు. గత 36 ఏళ్ల క్రితం వచ్చిన 'నినైత్తాల్
ఇనిక్కుం' సినిమాలో చివరిగా వీరిద్దరూ కలసి నటించారు.
అయితే ఆ తర్వాత ఎన్నో సార్లు వీరిద్దరిని
కలిపి సినిమా తీయాలను పలువురు దర్శక నిర్మాతలు విఫలయత్నం చేశారు. ఇన్నేళ్ల
తర్వాత వారు కలిసి నటించే అవకాశం కనిపిస్తోందనే వార్త కోలీవుడ్‌లో
వినిపిస్తోంది. ఇందుకు ప్రధాన కారణంగా ఇటీవల లింగ సినిమాతో పడరాని పాట్లు
పడిన రజనీకాంత్, తనకు కమర్షియల్ సినిమా చేసిపెట్టమని దర్శకుడు శంకర్‌ని
అడిగారట.
వెంటనే ఆయనో కథ వినిపించాడట. అందులో హీరో
పాత్రకి సరితూగే విలన్ పాత్ర ఉంది. ఆ విలన్ పాత్రని కమల్ తో చేయిస్తే
బాగుంటుంది అనే ఉద్దేశ్యంతో కమల్‌ని సంప్రదించారట. ఆయన కూడా ఓకే అన్నాడని
సమాచారం. మరి వీరి సన్నాహాలు ఫలిస్తాయో లేదో వేచి చూడాల్సిందే.
0 comments:
Post a Comment