టాలీవుడ్ హాస్య నటుడు అలీ ఏదైనా సినిమా వేడుకకు వ్యాఖ్యాతగా
వ్యవహరించాడంటే చాలు ఎవరో ఒక సెలబ్రిటీపై డబుల్ మీనింగ్ డైలాగులతో ఇబ్బంది
పెట్టడం ఖాయం. యాంకర్ సుమ, శ్యామలతో పాటు హీరోయిన్ సమంత వంటి వారు చాలామంది
అలీ బాధితులుగా చెప్పుకోవచ్చును. ఇప్పుడు ఆ జాభితాలోకి మరో హీరోయిన్
చేరింది. రాశిఖన్నాపై తాజాగా అలీ చేసిన కామెంట్ హాట్ టాపిక్ గా మారింది.
ఇటీవల
మాటీవీ సినిమా అవార్డ్స్ వేడుక ఘనంగా జరిగింది, ఆ వేడుకకు అలీ హోస్ట్ గా
వ్యవహరించిన విషయం తెలిసిందే. సినిమా రంగానికి చెందిన సెలబ్రిటీలు చాలామంది
పాల్గొన్న ఈ కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి చాలామంది
హీరోయిన్లు హాట్ గా తయారయి వచ్చారు. వారందరిలో రాశిఖన్నా వేసుకొచ్చిన గౌను
హాట్ టాపిక్ అయింది. అది కాస్త అలీ దృష్టిలో పడడంతో వెంటనే రాశిఖన్నాపై
సెటైర్లు వేశాడు అలీ. ఆ సెటైర్లలో డబుల్ మీనింగ్ వచ్చేలా ఆ అవార్డు ఫంక్షన్
కు వచ్చిన వారంతా అలీ మాటలను తెగ ఎంజాయ్ చేస్తున్నారు.
రాశిఖన్నా గౌను పై కామెంట్ చేస్తూ అలీ….’ఈసారి ఇటువంటి పెద్ద ఫంక్షన్స్ కు
వచ్చేటప్పుడు ఇలాంటి గౌనులు వేసుకోచ్చేటప్పుడు నా సేవలు ఉపయోగించుకో గౌను
ఎత్తి పట్టుకొని నీకూడ నడిచి వస్తూ నీకు సహాయం చేస్తాను’ అంటూ షాకింగ్
కామెంట్ చేశాడు అలీ. అంతేకాదు రాశిఖన్నా డ్రస్ ని చూస్తూ ఉంటె స్వచ్చ భారత్
కార్యక్రమానికి రాశి బ్రాండ్ అంబాసిడర్ గా మారుతుందా అనే అనుమానం
వస్తుంది అన్నాడు .
0 comments:
Post a Comment