CSS Drop Down Menu

Tuesday, August 11, 2015

వారానికి ఒకసారైనా "చేపలు" తినాలి ! ఎందుకంటే ?

కీళ్లనొప్పుల నుంచి ఉపశమనం లభించాలంటే వారానికి ఒకసారైనా చేపలు తినాలని అధ్యయనంలో తేలింది. చేపలను తినడం వల్ల పలు రకాలైన ప్రయోజనాలున్నాయి. అయితే తాజా అధ్యయనంలో తేలిన విషయమేమిటంటే..? వారానికి ఒకసారైనా చేపలను తినడం వల్ల రుమటాయిడ్‌, ఆర్థ్రరైటిస్‌ వంటి కీళ్లనొప్పుల ముప్పును సగం వరకూ తగ్గించుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. 
 
స్వీడన్‌కు చెందిన కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన పరిశోధకుల బృందం సుమారు 32 వేలమంది స్వీడన్‌ మహిళలపై అధ్యయనం చేపట్టింది. ఈ పరిశోధకుల బృందం తమ పరిశోధనకు ఎంపిక చేసుకున్న మహిళల ఆహారపు అలవాట్లను గురించి విశ్లేషించింది. వీరిలో ఒమెగా`3 కొవ్వు ఆమ్లాలను ఎక్కువగా తీసుకున్న వారిలో కీళ్లనొప్పుల ముప్పు తక్కువగా ఉన్నట్టు తేలింది. 
 
సాల్మొన్‌, తాజా ట్యూనా వంటి చేపల్లో అధికంగా ఈ ఒమెగా`3 కొవ్వు ఆమ్లాలు లభ్యమవుతాయి. ఈ అధ్యయనంలో పాల్గొన్న మహిళల్లో 27 శాతం మంది ఈ కొవ్వు ఆమ్లాలను తక్కువగా తీసుకుంటున్నట్టు పరిశోధకులు గుర్తించారు. మొత్తంగా కీళ్లనొప్పులకు ఎక్కువగా గురయ్యే మహిళలు వారానికి ఒకసారైనా నూనెతో కూడిన చేపల్ని తినాలని పరిశోధనలో పాల్గొన్న ప్రొఫెసర్‌ అలన్‌ సిల్మాన్‌ చెబుతున్నారు.

0 comments:

Post a Comment