భారతదేశ చరిత్రలో ఏ గ్రామానికీ లేని ప్రత్యేకతను ఆ గ్రామం సొంతం
చేసుకుంది. ఇంటికో ఉద్యోగి ఉంటే గొప్పగా చెప్పుకుంటారు. ఒకే జిల్లా నుంచి
ఇద్దరు ఐఏయస్ అధికారులు ఎంపిక అయ్యారంటే ఇంకా గొప్పగా చెప్పుకుంటారు. అదే
మరి గ్రామంలో ఇంటికో ఐఏయస్ ఉంటే ఇంకెంత గొప్పగా ఉంటుంది? నిజంగా అసలు
అలాంటి గ్రామం ఒకటి ఉందా? అనేగా మీ డౌట్. అదే ఉత్తరప్రదేశ్.. జౌన్‌పూర్
జిల్లాలోని 'మేధోపట్టి' గ్రామం. ఈ గ్రామంలో ఇంటికో ఐఏయస్ ఉన్నారు. అక్కడ ఉండే
మొత్తం 75 కుటుంబాల్లో.. ప్రతి ఇంటినుంచీ ఓ ఐఏయస్ లేదా ఐపీయస్ అధికారి
ఉన్నారు.
గ్రామంలో డిగ్రీ పూర్తి చేసిన ప్రతి గ్రాడ్యుయేటూ సివిల్స్‌కు ప్రిపేర్
కావడం తమకెంతో గర్వంగా ఉంటుందంటారు ఆ గ్రామ పెద్దలు. అసలింతకీ ఇంత మారుమూల
గ్రామం ఈరికార్డు సాధించడానికి కారకుడు మొదట ముస్తఫా హుస్సేన్ అనే
వ్యక్తి. తొలుత ఈ గ్రామం నుంచి 1914 లో సివిల్ సర్వీసెస్‌లో చేరడమే
స్ఫూర్తి కలిగించింది. అతని తరువాత ఇదే గ్రామం నుంచి ఇందు ప్రకాష్ అనే
వ్యక్తి సివిల్ సర్వీస్‌లో రెండో ర్యాంక్ సాధించి ఐఏయస్‌కు సెలెక్ట్
అయ్యాడు. అది మొదలు సివిల్స్‌లో ర్యాంకుల పంట పండిస్తూనే ఉంది. ఈ
గ్రామానికున్న మరో ప్రత్యేకత ఏంటంటే.. ఒకే ఇంటినుంచి నలుగురు అన్నదమ్ములు
సెలెక్ట్ కావడం.ఈ రికార్డును కూడా మేధోపట్టి గ్రామం సొంతం చేసుకుంది.
మన దగ్గరా అలాంటి గ్రామం ఉంది. వరంగల్ జిల్లా కురవి దగ్గర ఒక లంబాడా తండాలో అంతా ఉద్యోగస్తులే. ఇరవై మంది కలెక్టర్లు....ఇంకో ఇరవై ఎస్పీలు ఉంటారు. టీచర్లకైతే వంద దాటుతారు
ReplyDelete