యువకులకు ఇది నిజంగానే చేదువార్తే.
పాతికేళ్ళలోపు తండ్రి అయితే వారు త్వరగానే చనిపోతారని ఓ పరిశోధనలో
వెల్లడైంది. ఫిన్లాండ్‌లోని హెల్సింకీ విశ్వవిద్యాలయానికి చెందిన
పరిశోధకులు పురుషుల జీవనప్రమాణాలపై పరిశోధనలు నిర్వహించారు. ఈ పరిశోధనల్లో
కొన్ని సంచలన విషయాలు వెలుగుచూశాయి.
ఈ యూనివర్శిటీకి చెందిన ఎపిడమాలజీ అండ్
కమ్యూనిటీ హెల్త్ జర్నల్‌లో ప్రచురించిన వివరాల ప్రకారం... యుక్త వయసులోనే
తండ్రయితే... తొందరగా మరణించే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. 25 ఏళ్ల
లోపు పిల్లల్ని కంటే దాని ప్రభావం మహిళల కంటే పురుషులపైనే ఎక్కువగా
ఉంటుందని పరిశోధకులు తెలిపారు. భర్తగా, తండ్రిగా, కుటుంబ యజమానిగా తీవ్ర
ఒత్తిడిని ఎదుర్కోవాల్సి ఉంటుందని, దానిని తట్టుకోలేకపోతే ఆరోగ్యం
క్షీణించి, త్వరగానే మృత్యువాతపడుతున్నారని పేర్కొంది.
చిన్న వయసులోనే తండ్రి కావడం వల్ల పదేళ్లలో
ఒకటి నుంచి 20 మంది వరకు అర్థాయుష్కులవుతున్నారని ఈ పరిశోధన తేల్చింది. 21
శాతం మంది తీవ్ర గుండెజబ్బులు, 16 శాతం మద్యపాన సంబంధిత వ్యాధుల వల్ల
మరణిస్తున్నారని తెలిపింది. 25 ఏళ్లకు ముందే తండ్రి అయితే 40 నుంచి 45 ఏళ్ల
మధ్య మరణించే ప్రమాదముందని పరిశోధన వెల్లడించింది.
0 comments:
Post a Comment