బాలీవుడ్‌లో అతను పేరున్న యాక్టర్. కానీ అతనికి తోటి నటుల్ని కొట్టే
అలవాటుంది. విచిత్రంగా ఉందా? అతనెవరో తెలుసుకోవాలని యాగ్జైంటీగా ఉందా?
అతనే ఆదిత్య పంచోలి.. ఈ నటుడి చేతికి దూకుడు ఎక్కువే.. అయితే ఎప్పుడూ ఆ
దూకుణ్ని తగ్గించుకునే ప్రయత్నం చేయలేదు. సెట్లో అనేక సార్లు సాటి నటుల మీద
చేయి చేసుకుని వివాదాలు కోరి తెచ్చుకున్న సంఘటనలు చాలా ఉన్నాయి. కారణం
లేకుండానే సహనటుల మీద కేకలు వేయడం, తగాదాలు పెట్టుకోవడం ఆదిత్య పంచోలికి
అలవాటే.
తాజాగా 'లాఖోం హై యహా దిల్‌వాలే' షూటింగ్ సమయంలో అతనితో సెట్లో
షూటింగ్‌లో పాల్గొంటున్న విజయ్ భాటియా మీద చేయి చేసుకున్నాడట. షాట్
తీసేందుకు రెడీ గా ఉన్న సమయంలోనే ఆదిత్య పంచోలీ విజయ్ భాటియాను గట్టిగా
చెంప దెబ్బ కొట్టడంతో సెట్లో అందరూ నిశ్చేష్టులయ్యారట. కారణం లేకుండా విజయ్
భాటియా మీద చేయి చేసుకోవడంపై సెట్లో అందరూ తలలు పట్టుకున్నారట. ఇంతలో
డైరెక్టర్ తేరుకుని పరిస్థితిని చక్కబెట్టారట. గతంలో సంజయ్ లీలా భన్సాలీ
తీస్తున్న బాజీరావ్ మస్తానీ సినిమా షూటింగ్‌లో కూడా ఈ నటుడు టెక్నికల్ టీమ్
పై చేయిచేసుకున్నట్టు మీడియాలో వార్తలొచ్చాయి.
0 comments:
Post a Comment