CSS Drop Down Menu

Saturday, August 15, 2015

"సెక్స్ కోరిక"లను తీర్చే రోబోలు ?

మనిషి సృష్టించిన వాటిలో అత్యద్భుతమైనది రోబో. ఆ మధ్య సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన రోబో చిత్రం చూసే ఉంటారు. అందులో రజనీకాంత్ తయారు చేసే చిట్టి రోబోకు మనిషివలే కోపం, సంతోషం వంటి ఫీలింగ్స్‌ను తెప్పిస్తాడు. అయితే చిట్టి రోబో ఐశ్వర్యారాయ్‌ని ప్రేమించి, పెళ్లాడేందుకు సిద్ధమవుతుంది. అందుకోసం మనిషికి ఉండే శృంగార శక్తిని కూడా అందుకుంటుంది.
 
అది సినిమా కథే కావచ్చు. అయితే ఆ కథ నిజం కావడానికి ఎంతో కాలం పట్టదు. మరో 50 ఏళ్ల కాలంలో మనిషి సెక్స్ కోరికలను తీర్చే రోబోలు అందుబాటులోకి రానున్నాయి. ఈ విషయాన్ని సండర్‌ల్యాండ్ యూనివర్శిటీ అధ్యాపకులు డాక్టర్ హెలెన్ డ్రిస్కోల్ స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే ఇంటి పని, ఆఫీసుల్లో పని కోసం రోబోలను తయారు చేసి వినియోగిస్తున్నారు. భవిష్యత్‌లో శృంగార కోరికలను తీర్చగలిగే రోబోలను తయారుచేస్తున్నట్టు తెలిపారు. 
 
ఈ సందర్భంగా డాక్టర్ డ్రిస్కోల్ మాట్లాడుతూ.. అత్యధునిక పరిజ్ఞానంతో రోబో ఫిలియా అనే ఒక రోబోను తయారు చేసినట్టు తెలిపారు. దీన్ని మరింత అభివృద్ధి పరిచి మనిషికి తృప్తినిచ్చే శృంగార శక్తిని ఆ రోబోలో ఉండేలా చేస్తామని అన్నారు. ఇక మనిషి తన సెక్స్‌ తృప్తిని తీర్చుకునేందుకు రోబో సెక్స్‌‌లను తమ ఇంట్లో ఉంచుకునే రోజులు త్వరలోనే రాబోతున్నాయని డాక్టర్‌ డ్రిస్కోల్ తెలిపారు. 2070 సంవత్సరంలో సెక్స్ రోబోలు అందుబాటులోకి వస్తాని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు.
 


0 comments:

Post a Comment