CSS Drop Down Menu

Monday, August 17, 2015

నాగార్జునను బాధకు గురిచేసిన 'బాహుబలి'

ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినిమా ఖ్యాతిని చాటిచెప్పిన రాజమౌళి 'బాహుబలి',  కింగ్ నాగార్జునను బాధకు గురిచేసింది. ఏఎన్‌ఆర్‌, ఎన్టీఆర్ నటించిన పౌరాణిక చిత్రాలంటే తనకు చాలా ఇష్టమని, అలాంటి పాత్రలు చేయాలని ఉందని నాగ్ తన మనసులోని మాట బయటపెట్టారు. కానీ అందుకు తగ్గ సందర్భం రావడం లేదన్నారు. బాహుబలి చిత్రం చాలా గొప్పగా ఉంది.  అందులో నటించిన వారందరూ నిజంగా అదృష్టవంతులని ఆయన అభినందించారు. 'బాహుబలి' చిత్రంలో నటించలేకపోవడం తనకు బాధగా ఉందని సాక్షాత్తూ నాగ్ స్వయంగా వెల్లడించారు. అనంద్‌ నీలకంఠన్‌ రాసిన 'అజయ2 - రైజ్‌ ఆఫ్‌ కలి' పుస్తక విడుదల కార్యక్రమంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు.

0 comments:

Post a Comment