CSS Drop Down Menu

Thursday, August 20, 2015

మొక్క‌జొన్న‌ తింటే ?

మొక్కజొన్న చూస్తే కొందరికి ముఖం ముడతలు పడుతుంది. మరీ అంత ఎక్కువగా ఏమి తినరు. కానీ మొక్కజొన్న రోజువారి ఆహారంలో భాగమైతే ఎంతబాగుంటుందంటే మీకు ఆశ్చర్యం కలుగుతుంది. కొవ్వు పదార్థాలను తగ్గిస్తుందట. బలానికి బలం చేకూర్చుతుందట. ఇంకా ఎన్నెన్నో మేళ్ళు.. వివరాలిలా ఉన్నాయి. 
 
ప్ర‌తిరోజూ మొక్క‌జొన్న‌ను ఆహారంలో చేర్చుకోవ‌డం వ‌ల‌న మంచి ప్ర‌యోజ‌నాలున్నాయి. ముఖ్యంగా మొక్క‌జొన్న‌ల్లో కొవ్వును త‌గ్గించే సుగుణం ఉంది. మొక్క‌జొన్న‌లు ప‌చ్చివి, కాల్చిన‌వి, ఉడ‌క‌బెట్టిన‌వి ఏవైనా స‌రే మ‌న శ‌రీరంలోని కొవ్వు పని పడతాయట. కొవ్వును కరిగించి నియంత్రిస్తాయట.  
 
అంతేకాదు వీటిలో ఉన్న లినోలికాసిడ్‌, ఫోలికాసిడ్‌, విట‌మిన్ ఇ, బి1,బి6, నియాసిన్‌, రిబోఫ్లావిన్ వ‌ల్ల చిన్నారుల‌కు, మ‌ధుమేహ‌రోగుల‌కు కూడా ఎంతో మంచిందట. జీర్ణ‌క్రియ‌ను మెరుగు ప‌రిచి మ‌ల‌బ‌ద్ద‌కాన్ని నివారిస్తుంది. ర‌క్త‌లేమిని త‌గ్గిస్తాయి. ఇన్ని సలక్షణాలు ఉన్న మొక్కజొన్న రోజూ తీసుకోవడానికి ఇబ్బంది ఏంటి..? లెటజ్ ట్రై...! 


0 comments:

Post a Comment