స్త్రీ, పురుషులతో కలిసి జీవించేదే సమాజం.
మహిళలు లేని ప్రపంచాన్ని ఊహించలేని విధంగా పురుషులు లేని లోకం కూడా ఉండదు.
అయితే కెన్యా దేశంలో పురుషులే లేకుండా మొత్తం మహిళలే జీవిస్తున్న ఒక గ్రామం
ఉంది. నమ్మలేకపోతున్నారా..? ఇదేదో అలనాటి తెలుగు సినిమా అనుకునేరు. అవును
ఇది నిజమే. దక్షిణ కెన్యా దేశ రాజధాని నైరోపి నగరం నుంచి 380 కిలో మీటర్ల
దూరంలో ఉన్న సంబురు ప్రాంతంలోనే ఈ గ్రామం ఉంది.
ఉమేంజో అనే ఈ గ్రామంలో మహిళలు మాత్రమే
జీవిస్తున్నారు. గృహ హింస, బాల్య వివాహాలు, లైంగిక వేధింపులు లాంటి పలు
కారణాల చేత బాధింపబడిన 15 మంది మహిళలు కలిసి 1990లో ఈ గ్రామాన్ని
నిర్మించారు. ప్రస్తుతం ఈ గ్రామంలో 47 మంది మహిళలు, 200 మంది చిన్నారులు
జీవిస్తున్నారు. పురుషులే లేని ఈ గ్రామానికి బ్రిటన్ సైన్నికుల చేత
అత్యాచారానికి గురైన రెబెక్క లోలోసేలి అనే మహిళ అధ్యక్షురాలిగా ఉంటుంది.
ఈ గ్రామంలో మహిళలు ఆభరణాలను తయారుచేసి
విక్రయించడం ద్వారాను, ఈ ప్రాంతంలో గుడారాల చేత పర్యాటక ప్రాంతంగా
ఏర్పాటుచేసి తద్వారా వచ్చే ఆదాయంతోనూ వీరు జీవనోపాధి పొందుతున్నారు. ఈ
గ్రామంలో పురుషులకు నిషేధం లేదు. అయితే ఇక్కడి మహిళల అనుమతించినన్ని రోజులు
మాత్రమే ఉండాలి. తద్వారా పురుషుల కింద బానిసలుగా కాకుండా స్వేచ్ఛా
జీవులుగా తమ జీవితాన్ని గడుపుతున్నట్టు ఇక్కడి మహిళలు తెలుపుతున్నారు.
మహిళలు మాత్రమే ఉంటున్న గ్రామం కావడంతో ఇరుగుపొరుగు గ్రామాల్లో ఉన్న పురుషులు అప్పుడప్పుడు హద్దుదాటి లోపలికి ప్రవేశిస్తుంటారు. అయినప్పటికీ వారిని ధైర్యంగా ఆ మహిళలు ఎదుర్కొంటుంటారు. ఈ గ్రామంలో ఉన్న 247 మంది కలిసి పది కుటుంబాలుగా జీవిస్తున్నారు.
మహిళలు మాత్రమే ఉంటున్న గ్రామం కావడంతో ఇరుగుపొరుగు గ్రామాల్లో ఉన్న పురుషులు అప్పుడప్పుడు హద్దుదాటి లోపలికి ప్రవేశిస్తుంటారు. అయినప్పటికీ వారిని ధైర్యంగా ఆ మహిళలు ఎదుర్కొంటుంటారు. ఈ గ్రామంలో ఉన్న 247 మంది కలిసి పది కుటుంబాలుగా జీవిస్తున్నారు.
0 comments:
Post a Comment