CSS Drop Down Menu

Friday, April 17, 2015

"పాలు" తాగితే "డయాబెటిస్" దూరం ?

 
డయాబెటిస్ రాకుండా ఉండాలంటే పాలు తాగడమే సరైన మార్గం. అయితే కొవ్వులు తక్కువగా ఉండే పాలను మాత్రమే తాగాలి. దీనివల్ల టైప్-2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది. స్త్రీ పురుషుల ఆహారపు అలవాట్లు, ఆరోగ్యం మీద జరిగిన పరిశోధనలో కొవ్వులు తక్కువగా వున్న పాలు లేదా ఇతర పాల ఉత్పత్తులు తీసుకుంటే టైప్-2 డయాబెటిస్ దూరమయ్యే అవకాశం ఉందని వైద్యులు అంటున్నారు. 
 
స్త్రీలు తాగే ప్రతి గ్లాసు పాలకు డయాబెటిస్‌ని దూరం చేసే శక్తి 2శాతం పెరుగుతుంది. ఆహారంలో తీసుకునే కాల్షియం, విటమిన్ డిలకు అతీతంగా పాల ప్రభావం ఉంటుంది. ఇటువంటి పాలు తాగడం వల్ల బరువు తగ్గుతారు. రక్తపోటు అదుపులో ఉంటుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ సిండ్రోమ్ ఏర్పడదు. వీటితో పాటు సమతుల్య ఆహారం తీసుకోవడం, శారీరక వ్యాయామం కూడా అవసరం. ఇవి పాటిస్తే డయాబెటిస్‌ను ఈజీగా దూరం చేసుకోవచ్చు.


0 comments:

Post a Comment