CSS Drop Down Menu

Wednesday, April 15, 2015

ఇకపై "రైళ్లలో హాయిగా నిద్రపోవచ్చు" ?


ఇకపై రైళ్లలో హాయిగా నిద్రపోవచ్చు.. స్టేషన్ దాటిపోయే సమస్యే లేదు! ఎందుకంటే ఐఆర్ సీటీసీ, భారత్ బీపీవో సంస్థలు సంయుక్తంగా సరికొత్త సౌకర్యాన్ని ప్రయాణికులకు అందుబాటులోకి తేనున్నాయి. ఈ సరికొత్త సౌకర్యం ప్రకారం దిగాల్సిన స్టేషన్‌కు సరిగ్గా అరగంట ముందుగా అలారం కాల్ వస్తుంది. ఈ అలారం కాల్ రావడానికి ప్రయాణికులు 139 నెంబర్‌కు డయల్ చేసి అందులో 7 ఆప్షన్ ద్వారా పీఎన్ఆర్ నెంబర్, దిగాల్సిన స్టేషన్ పిన్ కోడ్, స్టేషన్ పేరు తదితర వివరాలు నమోదు చేయాలి. 
 
వాటిని నిక్షిప్తం చేసుకున్న ఐఆర్ సీటీసీ మీరు దిగాల్సిన స్టేషన్ మరో అరగంటలో చేరుకుంటుందనగా, మీకు అలెర్ట్ కాల్ చేస్తుందని, ఒకవేళ ట్రైన్ అరగంట ఆలస్యంగా ప్రయాణిస్తే, అలెర్ట్ కాల్ కూడా అరగంట ఆలస్యంగానే వస్తుందని రైల్వే అధికార ప్రతినిధి నీరజ్ శర్మ వెల్లడించారు. సంక్షిప్త సందేశం(ఎస్ఎంఎస్) ద్వారా కూడా అలెర్ట్ అందించే సౌలభ్యం ఉందని నీరజ్ చెప్పారు. దీంతో రైళ్లలో దిగే స్టేషన్‌పై టెన్షన్ పడకుండా నిద్రపోవచ్చు. 


0 comments:

Post a Comment