CSS Drop Down Menu

Monday, August 4, 2014

అల్లు అరవింద్ ని "చెంపదెబ్బ" కొట్టింది ఎవరు ?

ఒకాయన ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ చెంప ఛెళ్లుమనిపించాడట! ఇంత పెద్ద నిర్మాతని పట్టుకుని చేయి చేసుకోవడమా? ఆ కొట్టినతడికి ఎంత ధైర్యం వుండి వుండాలి అనే అనుమానం రాకమానదు. ఇంతకీ ఆయన్ని కొట్టిన వ్యక్తి ఎవరబ్బా అని ఆలోచిస్తున్నారా? ఆయనెవరో కాదులెండి.. అల్లు అరవింద్ తండ్రి, ప్రముఖ హాస్య నటుడు కీర్తి శేషులు అల్లు రామలింగయ్య గారే. కానీ అది ఇప్పుడు కాదు.. అల్లు అరవింద్ యువకుడిగా వున్న రోజుల్లో జరిగిందీ ఘటన.
ఒకరోజు అల్లు అరవింద్ కారు డ్రైవింగ్ చేస్తుండగా తండ్రి అల్లు రామలింగయ్య తన పక్క సీట్లో కూర్చున్నారట. కారు ఇంటివద్దకు చేరుకోగానే కారుని సడెన్ బ్రేక్ వేశారట. దీంతో ఒక్కసారిగా కుదుపునకు గురైన అల్లు రామలింగయ్య తలకి స్వల్పంగా దెబ్బ తగలడం.. ఆ కోపంలోనే ఎవడ్రా? .... నీకు డ్రైవింగ్ నేర్పింది అంటూ పక్కనే వున్న కొడుకు చెంపపై ఒక్కటిచ్చుకోవడం అంతా క్షణాల్లో జరిగిపోయిందట. ఇదే విషయాన్ని తాజాగా ఓ పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అల్లు అరవింద్ తన జీవితంలో మరిచిపోలేని మధురజ్ఞాపకంగా గుర్తుచేసుకున్నారు .

0 comments:

Post a Comment