మొక్కజొన్న తీసుకోవడం ద్వారా శరీరానికి కావలసిన బలం చేకూరుతుంది. అలాగే ఒబిసిటీని దూరం చేస్తుంది.
ఉదర సంబంధిత వ్యాధులు, నోటి దుర్వాససను
దూరం చేసే మొక్కజొన్నలో పీచుపదార్థాలు ఎక్కువగా ఉంటాయి. కొవ్వు తక్కువ.
అజీర్తికి చెక్ పెడుతుంది. సరి సమానంగా కార్బొహైడ్రేడ్ మరియు కెలోరీలను
కలిగివుండే మొక్కజొన్నను రోజూ తీసుకోవడం ద్వారా శరీరానికి కావలసిన పోషకాలు
అందుతాయి.
అలాగే మొక్కజొన్న డయాబెటిస్,
హృద్రోగవ్యాధులను నియంత్రిస్తుంది. పీచు, కార్బొహైడ్రేడ్లను కలిగివున్న
మొక్కజొన్న గింజల్ని రోజూ అరకప్పు తీసుకుంటే అనారోగ్య సమస్యలు తలెత్తవని
ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
పసుపు రంగు మొక్కజొన్నల్ని తీసుకుంటే గొంతు
వ్యాధులను దూరం చేసుకోవచ్చు. అలాగే కంటిచూపు, దృష్టి ప్రభావం లేకుండా
చేస్తుంది. గర్భిణీ మహిళలకు మేలు చేసే ఆహారంలో మొక్కజొన్న ఒకటి.
మొక్కజొన్నలో ఫ్యాట్ ఫుడ్ కావడంతో గుండెకు మేలు చేస్తుంది. మానసిక ఒత్తిడి,
హృద్రోగ వ్యాధులను నయం చేస్తుంది. కార్న్ ఫ్లోర్‌ను వంటలు, సౌందర్యానికి
ఉపయోగించడంతో పాటు చర్మ సంబంధిత అలెర్జీలపై రాస్తే ఉపశమనం లభిస్తుంది.
0 comments:
Post a Comment