మెగాస్టార్ చిరంజీవి నటించే 150వ చిత్రంలో విలన్‌గా చేస్తానని హీరో రాజశేఖర్ చెప్పారు. మల్టీస్టారర్ సినిమాలో నటించాల్సి వస్తే ఏ హీరోతో నటిస్తారని డాక్టర్ రాజశేఖర్‌ను ప్రశ్నిస్తే ఆయన ఎవరూ ఊహించని విధంగా అంటే పై విధంగా సమాధానమిచ్చారు. మెగాస్టార్ చిరంజీవితో నటించాలనుందని చెప్పి అందరూ అవాక్కయ్యేలా చేశారు.
ఇంతకీ ఈ ప్రశ్న అడిగింది ఎవరో కాదు ఆయన శ్రీమతి జీవిత. ఓ టీవీ కార్యక్రమంలో రాజశేఖర్‌కు జీవిత ఈ ప్రశ్న సంధించారు. అయితే ఏమాత్రం తడుముకోకుండా రాజశేఖర్ చిరంజీవి పేరు చెప్పడం విశేషం. చిరంజీవికి ధీటుగా ఉండే పాత్ర అయితే విలన్‌గా చేయడానికి కూడా సిద్ధమని రాజశేఖర్ ప్రకటించారు.
0 comments:
Post a Comment