CSS Drop Down Menu

Friday, August 22, 2014

"15 సంవత్సరాలకే శృంగారం"


దేశంలోని అమ్మాయిలు  చాలా ఫాస్ట్‌గా ఉన్నారు. కేవలం 15 యేళ్ళకే తమ కన్యత్వాన్ని కోల్పోతున్నట్టు నిస్సగ్గుగా చెపుతున్నారు. పెళ్లికి ముందే అన్నీ అయితే అనుభవం ఉంటుందని గర్వంగా ఫీల్ కావడం వల్లే కాఫీ షాపులు, పబ్బుల్లో ఎంజాయ్ చేస్తున్నట్టు వెల్లడించారు. అంతేకాకుండా, తమకు లభించిన పూర్తి స్వేచ్ఛ కారణంగా దూర ప్రదేశాల్లో చదువుతూ, ఉద్యోగాలు వెలగబెట్టే అనేక మంది యువతీ యువకులు తమ సహచరులతో సహజీవనం చేయడం ఫ్యాషనైపోయిందని తాజాగా నిర్వహించిన ఒక సర్వే వెల్లడించింది. 


ఇదే అంశంపై కేంద్ర ఆరోగ్య శాఖ ఓ సర్వే నిర్వహించింది. అందులో దిగ్భ్రమకు గురి చేసే అంశాలు వెలుగు చూశాయి. పెళ్లికి ముందు జాగ్రత్తగా ఉండాల్సిన అమ్మాయిలు స్వేచ్ఛ పేరుతో... పురుషులు చేస్తే తప్పులేదు, మేము చేస్తే తప్పా అనే వితండవాదంతో విచ్చలవిడిగా తిరుగుతున్నారు. దానికి స్నేహం, ప్రేమ ఇలా రకరకాల పేర్లు పెడుతున్నారు. 


ఆంధ్రప్రదేశ్, బీహార్, జార్ఖండ్, మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు రాష్ట్రాల్లో కేంద్ర ఆరోగ్య శాఖ నిర్వహించిన సర్వే ప్రకారం 15-24 ఏళ్ల మధ్య వయసులో ఉన్న అబ్బాయిలను, అమ్మాయిలను ప్రశ్నించారు. వారిలో 15 ఏళ్ల లోపు ఉన్న అమ్మాయిలు తాము శృంగారంలో పాల్గొన్నట్టు తెలిపారు. 24 శాతం మంది అమ్మాయిలు తాము పెళ్లికి ముందే శృంగారంలో పాల్గొంటున్నట్టు వెల్లడించారు. అమ్మాయిలతో పోల్చితే అబ్బాయిలు లేటుగా శృంగారంలో పాల్గొంటున్నట్టు సర్వే తెలిపింది. 


దీంతో పెళ్లికి ముందు శృంగారం సర్వసాధారణమై పోయింది. పెళ్లికి ముందు సెక్స్ తప్పుకాదని తమిళ నటి ఖష్బూ చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం రేపాయో అందరికీ తెలిసిందే. మరో సినీ నటి షెర్లీన్ చోప్రా పెళ్లికి ముందు సెక్స్ తప్పుకాదని, పైగా అనుబంధం పెరుగుతుందని సెలవిచ్చింది. బంధం బలపడడం మాట అటుంచి పెళ్లికి ముందే శృంగారం కారణంగా చాలా మంది యువతులు మోసపోతున్నారు. 


అలాగే, పెళ్లికి ముందు సెక్స్ అనుభవించి, మోసపోయామని ఫిర్యాదులు చేసేవారూ తక్కువేం లేరు. కేవలం జూన్‌లోనే రాష్ట్ర మహిళా కమిషన్‌కు 150 కేసులు మోసపోయామని వచ్చాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అలా ఫిర్యాదు చేసేవారు కూడా 20-24 మధ్య వయస్కులు. మోసపోతున్నామని బాగా చదువుకుని, ఉద్యోగాలు చేసుకునే యువతులే ఎక్కువగా ఫిర్యాదులు చేయడం విశేషం. 


అయితే ఇవి ధైర్యం చేసి ఫిర్యాదు చేసిన యువతుల సంఖ్య. ధైర్యం చాలక, తాము చేసింది తప్పని తెలుసుకుని కొంతమంది, సిగ్గుతో కొంతమంది యువతులు ముందుకు రావడం లేదని. ఇవన్నీ సూచించేది ఒక్కటేనని, అది పెళ్లికి ముందు శృంగారం మంచిది కాదని, స్వేచ్ఛకు పరిధులు అవసరమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

1 comment:

  1. ఏం చెప్పేదీ?

    ఉ. ఎవ్వరి స్వేఛ్చకుం బరిధు లెవ్వరు గీసెద రట్లు చేయగా
    నెవ్వరి కేమి హక్కు కల దెవ్వరి బుధ్ధికి దోచినట్లుగా
    నవ్వల నేమి ముప్పు గల దన్నది ప్రక్కకు నెట్టి యుండు వా
    రవ్వల నాటి నీతు లిపు డక్కర లేదు కదా మహాప్రభో

    అదీ సంగతి!

    ReplyDelete