బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ చెన్నైలో స్టెమ్‌సెల్ బ్యాంకింగ్ గురించి ప్రస్తావించింది. అయితే ఇది స్టెమ్‌సెల్స్.. అంటే మూలకణాలను నిల్వచేసుకునే బ్యాంక్ అన్నమాట! మనిషి మూలకణాలతో అవయవాలను పునరుత్పత్తి చేయడమే గాక, అనేక రకాల వ్యాధులను వీటివల్ల నివారించవచ్చునని తేలింది. ఇది సామాన్యులకు కొత్తగా వినిపిస్తున్న టెక్నాలజీ! అప్పుడే పుట్టిన బిడ్డ పేగు నుంచి మూలకణాలను వేరు చేసి భద్రపరచడమే స్టెమ్‌సెల్ విధానం! పుట్టిన బిడ్డకు ఇచ్చేగిఫ్ట్‌గా దీనిని అనేకమంది తలిదండులు భద్రపరుస్తున్నారు.
ఇప్పటివరకు లక్షమందికిపైగా మూలకణాలను భద్రపరచుకున్నారట! వీటిని దాచుకోవడం ద్వారా భవిష్యత్తులో పలు ఆరోగ్యసమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చునని అంటున్నారు. దేశంలో మొదటిసారిగా మానవ జీవకణాలను దాచుకునే విధానాన్ని లైప్‌సెల్ సంస్థ ప్రారంభించింది. ఎవరైనా కేవలం 19 వేల 999 రూపాయలు చెల్లించి ఈ కణాలను ఈ బ్యాంక్ ద్వారా జీవితకాలం పాటు భద్రంగా దాచుకోవచ్చునని, సుమారు 80 రకాల జబ్బులను నివారించడానికి ఈ కణాలు ఉపయోగపడతాయని అంటున్నారు.
0 comments:
Post a Comment