చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా తనయుడు రామ్ చరణ్ తన తండ్రికి ఇచ్చిన విలువైన కానుక టాలీవుడ్ హాట్ టాపిక్ గా మారింది. దాదాపు 1.25 కోట్ల విలువైన ల్యాండ్ క్రూజర్ విఎక్స్ వి8 మోడల్ కు చెందిన విలాస వంతమైన కారును తన తండ్రికి పుట్టినరోజు బహుమతిగా ఇచ్చి తన తండ్రికి ఆనందాన్ని కలిగించి టాలీవుడ్ హాట్ న్యూస్ గా మారాడు.
ఈ కారును చిరంజీవి తన నేపాల్ పర్యటన ముగించుకుని వచ్చిన తరువాత ఉపయోస్తాడని న్యూస్. గతంలో కూడా రామ్ చరణ్ తన తండ్రికి రోల్స్ రాయస్ కారును బహుమతిగా ఇచ్చిన విషయం తెలిసిందే. తన తండ్రి నేపాల్ లో ఉన్నా తన తండ్రి తరఫున మెగా అభిమానులకు చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆతిధ్యం ఇస్తూ మెగా హీరోకు వారసుడిగా తన బాధ్యతను నిర్వర్తిస్తున్నాడు.
0 comments:
Post a Comment