CSS Drop Down Menu

Thursday, August 21, 2014

మీరు వాడే" టూత్ పేస్ట్‌లో ఏముందో" తెలుసా ?


మీ టూత్ పేస్ట్‌లో ఉప్పుందా అనేది నేడు ఓ ప్రముఖ బ్రాండెడ్ టూత్ పేస్ట్ అడ్వర్టైజ్‌మెంట్ లీడింగ్! కానీ మీ టూత్ పేస్ట్ ట్యూబ్ కిందిభాగంలో ఏ కలర్ ఉందో తెలుసా అనేది నేటి నెటిజెన్ క్వశ్చన్ ? ఏంటి ఏమీ అర్థం కాలేదా? అయితే ఈ స్టోరీ చదవాల్సిందే. నిత్యం సర్వసాధారణంగా వినియోగించే చాలారకాల ఉత్పత్తుల గురించి చాలామందికి పెద్దగా తెలీదు. కాకపోతే వాటి ఉపయోగం తప్పనిసరి కనుక తెలీకుండానే వాడేస్తుంటారు. ఇంకా చెప్పాలంటే తెలుసుకునే ప్రయత్నమైనా చేయరు. కొందరికి అంత టైమూ ఉండదు. అయితే ప్రపంచంలో చాలామందికి తెలీని ఫ్యాక్ట్.. అందరూ తెలుసుకుని తీరాల్సిన ఫ్యాక్టూ ఒకటుందంటున్నారు కొందరు నెటిజన్లు. మనం నిత్యం వాడే టూత్ పేస్ట్ ట్యూబుల క్రింప్‌పై భాగంలో చిన్న డబ్బా ఆకారంలో గ్రీన్, రెడ్, బ్లాక్, లేదా బ్లూ కలర్స్‌లో ఏదో ఓ కలర్ ప్రింట్ చేసి ఉంటుంది. ఈ విషయాన్ని చాలామంది పట్టించుకోరు. కానీ ఆ కలర్ వెనుక పెద్ద కథే ఉందట.


ఒక టూత్ పేస్ట్ క్రింప్‌పై బ్లాక్ కలర్ ప్రింట్ అయ్యిందంటే ఆ పేస్ట్ తయారీకి కేవలం కెమికల్స్‌ని మాత్రమే వినియోగించారని అర్థమట. అలాగే రెడ్ కలర్ ప్రింట్ అయ్యుంటే అందులో 70% కెమికల్స్, మరో 30% సహజ మూలికలుఉంటాయట. ఇక గ్రీన్ కలర్ విషయానికొస్తే, ఆ పేస్ట్ సహజ మూలికలతో తయారైందని అర్థమట.  అదే విధంగా బ్లూ కలర్ ప్రింట్ అయినట్లయితే, ఆ పేస్ట్‌లో కొంత సహజ మూలికలు, ఇంకొంత ఔషదాలు ఉన్నాయని అర్థమట. కొంతమంది విదేశీ నెటిజన్లు మొదటిసారిగా ఈ వాదనని తెరపైకి తెచ్చారు. దీంతో అసలు ఈ వాదనలో ఎంత మేరకు వాస్తవం తెలుసుకునే పనిలో పడ్డారు మిగతా నెటిజన్లు. సగటు నెటిజెన్ అంచనా కరెక్ట్ అయ్యుంటే రేపు మార్నింగ్ మీరు ట్యూబ్‌ని చేతిలోకి తీసుకోగానే ట్యూబ్ క్రింప్‌పై ఏ కలర్ ప్రింట్ అయ్యిందా అనేదే ఫస్ట్ చెక్ చేస్తారు. 

0 comments:

Post a Comment