CSS Drop Down Menu

Tuesday, August 12, 2014

"పులసల" పులుసు భలే పసందు!!!


 


తూర్పుగోదావరి జిల్లా లో సీజన్..నోరూరించే ఫిష్ వెరైటీ వచ్చేసింది. అదే..పులస చేప..దీన్ని ముద్దుగాఅక్కడ సెలబ్రిటీ ఫిష్ అని పిలుచుకుంటారు. మత్స్య ప్రియులు ఇష్టంగా తినే ఈ పులుసు చేప ఖరీదు కేజీ  1500 రూపాయల నుంచి నాలుగు వేల రూపాయల వరకు ఉంటోంది.ఈ చేపలు బంగాళాఖాతం ఉప్పు నీటి నుంచి ఆగస్ట్ సెప్టెంబర్ మధ్య కాలంలో గోదావరి జలాల్లో  ప్రవేశిస్తాయి.
రాజమండ్రి దగ్గర ధవళేశ్వరం సమీపంలో లభించే పులసచేపలకు ఎక్కువ డిమాండ్ వుంటుంది. యానాం, బొబ్బర్లంక ప్రాంతాల్లోనూ  ఇవి విరివిగా లభిస్తాయి. ధర ఎంత ఎక్కువైనా వీటి కోసం పులస ప్రియులు వెనుకాడడంలేదు. హాట్ కేకుల్లా అమ్ముడు పోయే ఈ చేపలను వండేటప్పుడు మాత్రం  జాగ్రత్తలు తీసుకోవాలి.


0 comments:

Post a Comment