CSS Drop Down Menu

Saturday, August 29, 2015

"కొండపైకి కారును లాక్కేల్లే" అయస్కాంతం కొండ ?

అయస్కాంత పర్వతం ఇదొక వివరించ సాధ్యం కాని అద్భుతం. సాధారణంగా కొండపైకి ఎక్కాలంటే ఎంతో కష్టపడాలి. ఒకవేళ ఆ కొండ మీదకు రోడ్డు వేసి కారులో వెళ్లమన్నా కారు నెమ్మదిగా పైకి వెళుతుంది. ఎంతో ఇంధనం వృధా అవుతుంది. 

కాశ్మీర్‌ లోని లడక్‌ ప్రాంతంలో లేహ్ సమీపంలో ఉన్న ఈ కొండ మాత్రం మిగిలిన కొండల్లాగా కాదు. తన దగ్గరకు వచ్చే వారిని ఎంతో ఆప్యాయంగా పలుకరించి, తనే స్వయంగా తీసుకువెళ్లిపోతుంది. అంటే, ఈ కొండ మీదకు కారులో వెళ్లాలనుకునేవారు హాయిగా ఇంజన్‌ను ఆఫ్‌ చేసి స్టీరింగ్‌ పట్టుకుని కూర్చుంటే చాలు. ఇనుపముక్కను అయస్కాంతం ఆకర్షించినట్లు కారును పైకి లాక్కుంటుంది. సహజసిద్ధంగా ఏర్పడిన అయస్కాంత తత్వమున్న ఈ కొండపైకి వెళ్లేవారు దీనిలోని అయస్కాంత శక్తికి అబ్బురపోతారు.


0 comments:

Post a Comment