మెక్సికోలోని శాన్ పెడ్రో హుమాలుల నగర్
మేయర్ జోయెల్ మేజన్ వివాహాన్ని ఆయన భార్య దగ్గరుండి మరీ ఘనంగా
నిర్వహించింది. హుమాలుల నగరంలో ఓ మూఢనమ్మకం బలంగా ఉంది. ఆ ఊరిపెద్ద మొసలిని
వివాహం చేసుకుంటే మత్స్య సంపద పెరుగుతుందని, ఆ నగరం సకల సంపదతో
అలరారుతుందని విశ్వాసం.
ఈ నగరానికి మేయర్‌గా ఎవరు ఎన్నికైనా
మొసలిని వివాహమాడడం సంప్రదాయం. అలా వివాహమాడిన మొసళ్లను నగరంలోని ఓ కొలనులో
ఉంచి పెంచుతారు. ఈ విశ్వాసమే మేయర్‌కు మొసలితో పెళ్లి జరిగేలా.. అదీ తన
భార్య పక్కనుండి జరిపేలా చేసింది.
మొత్తానికి శాన్ పెడ్రో నగర మేయర్ ఓ
మొసలిని పెళ్లి చేసుకున్నారు. వివాహానికి ముందు మొసలికి మరియా ఇసబెల్ అని
పేరు పెట్టారు. అనంతరం మొసలి వేలికి ఉంగరం తొడిగి జోయెల్ మేజన్ వివాహ తంతు
పూర్తిచేశారు.
0 comments:
Post a Comment