సెల్‌ఫోన్‌లో తీసే సెల్ఫీ ఫోటోలను అచ్చం
కాఫీలపై చిత్రీకరించే ఉపకరణాన్ని లండన్లో కనిపెట్టారు. ఈ సెల్ఫీ ఫోటోలతో
కూడిన కాఫీని ఇక టేస్ట్ చేయొచ్చు. సెల్ఫీలకు మోజు అంతా ఇంతా కాదనే విషయం
అందరికీ తెలిసిందే. సెల్ఫీ ఫోటోల్ని కాఫీల్లో చిత్రీకరించే కొత్త
టెక్నాలజీని లండన్లో కనిపెట్టారు. 3 డీ ప్రింటర్ టెక్నాలజీతో కాఫీ మిషన్‌ను
తయారు చేసి సెల్ఫీలను కాఫీలపై చిత్రీకరించే విధంగా రూపొందించడం జరిగిందని
శాస్త్రవేత్తలు అంటున్నారు.
సెల్ఫీ లేదా ఫోటో లేదా న్యూస్ వంటివి
దీనికోసం రూపొందించబడిన యాప్ ద్వారా కాఫీ షాపు వారికి పంపించాలి. కాఫీ
షాపుకు యాప్ ద్వారా పంపిన ఫోటోలు 10 సెకన్లలో మనం పంపిన ఫోటో లేదా
సెల్ఫీలతో చిత్రీకరించబడిన కాఫీ టేబుల్‌పై వుంటుందని లండన్ శాస్త్రవేత్తలు
అంటున్నారు. ఈ కాఫీకి యువతరంలో క్రేజ్ పెరిగిపోయిందని శాస్త్రవేత్తలు
అంటున్నారు.
0 comments:
Post a Comment