మనిషి జీవితంలో అత్యంత సుఖమైనది స్త్రీ, పురుషుల సంయోగం. నేటి ఆధునిక యుగంలో పెరిగిన పోటీతో ఉదయం మేల్కొన్నప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఉరకలు, పరుగులే. ఈ కారణంగా స్త్రీ, పురుషుల్లో సెక్స్ కోరికలు పూర్తిగా అడుగంటిపోతున్నాయి. దీంతో పురుషుల్లో పలువురు సెక్స్ కోరికలను పెంచుకునేందుకు మెడికల్ షాపుల్లో దొరికే మాత్రలపై ఆధారపడుతుంటారు. అయితే మనం నిత్యం తీసుకునే ఆహారంతోనే సెక్స్ వాంఛను పెంచుకోవచ్చు.
భారత దేశ సాంప్రదాయ వంటకాల్లో ఉపయోగించే వస్తువులలో అతి ముఖ్యమైనవి మెంతులు. అందువలనే మన పూర్వికులు మన ఆహార పదార్థాల్లో మెంతులకు ముఖ్యత్వం ఇచ్చి ఉన్నారు. మెంతులను ప్రతి రోజూ ఆహారంలో తీసుకుంటూ వస్తే పురుషులకు సెక్స్ కోరికలు పెరుగుతాయి. మెంతులు పురుషుల సెక్స్ హార్మోన్‌లను రెచ్చగొట్టేందుకు సహకరిస్తాయి. మెంతుల్లో ఉన్న సపోనిన్ అనే పదార్థం పురుషుల సెక్స్ హార్మోన్ టెస్టోస్టిరన్ పనితీరును మెరుగుపరుస్తుంది.
ఈ విషయం తాజాగా జరిపిన అధ్యయనం ద్వారా మరోసారి రుజువైంది. ఇందుకోసం పరిశోధకులు ఇటీవల 25 ఏళ్ల వయస్సు నుంచి 55 ఏళ్ల వయస్సులోపు గల 60 మంది పురుషులను పరిశోధించారు. వారికి రోజుకు రెండు సార్లు వంతున మెంతులు, మెంతుల రసం ఇచ్చారు. ఆరు వారాల తర్వాత వారికి సెక్స్ కోరికలు అత్యధికంగా పెరిగినట్లు గుర్తించారు.
అదే సమయంలో మెంతులు తినని కొందరిని పరిశోధించగా వారికి సెక్స్ కోరికలు తక్కువగానే ఉన్నట్టు తెలిసింది. దీంతో మెంతులను సెక్స్ ప్రియులకు వరప్రసాదంగా వైద్యులు అభివర్ణిస్తున్నారు. ఇక బయట మెడికల్ షాపుల్లో అడ్డమైన మందులను కొని, డబ్బుతో పాటు ఆరోగ్యాన్ని వృధా చేసుకోకుండా, ప్రతి రోజూ తీసుకునే ఆహారంలో మెంతులు చేర్చుకుంటే మంచి ఫలితాన్ని పొందవచ్చు.

0 comments:
Post a Comment