CSS Drop Down Menu

Wednesday, July 29, 2015

చంద్రబాబుకు ‘ఆగష్టు’ బెడద ?

ఆంధ్రప్రదేశ్‌లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుక ఈసారి వివాదాస్పదం అయ్యేలా కనిపిస్తోంది. మరో రెండువారాల్లో ఆగస్టు 15 వచ్చేస్తోంది. ఈసారి ఏపీ ప్రభుత్వం వేడుకలను ఎక్కడ నిర్వహించనుందన్న ప్రశ్న మళ్లీ మొదలైంది. ఇప్పటివరకు పూర్తిస్థాయి రాజధాని లేకపోవడంతో వేడుకలు ఎక్కడ నిర్వహించాలన్నదానిపై ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. ఐతే, విశాఖలో జరపాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు వార్తలు వస్తున్నాయి. కానీ ఈసారి కూడా రాయలసీమకే ఆ ఛాన్స్ ఇవ్వాలని అక్కడి నేతలు ముఖ్యమంత్రిపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. 
రాష్ర్ట విభజన తర్వాత తొలిసారి పంద్రాగస్టు వేడుకలు కర్నూలులో జరిగాయి. దీంతో ఈసారి ఉత్తరాంధ్రలోని విశాఖలో ఐతే బాగుంటుందని ప్రభుత్వం ఆలోచన చేసింది. ఇంతలోనే సొంతపార్టీలోని కొంతమంది నేతలు దీనికి అడ్డుపుల్ల వేస్తున్నట్లు సమాచారం. మళ్లీ సీమలోనే వేడుకలు జరపాలని ఒత్తిడి తీసుకొస్తున్నట్లు నేతలు చెబుతున్నారు. దీంతో ఈ అంశం మరోసారి వివాదం అయ్యేలా కనిపిస్తోంది. మరి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఏ నిర్ణయం తీసుకుంటారో కొద్దిరోజుల్లో తేలిపోనుంది. 
 

0 comments:

Post a Comment