CSS Drop Down Menu

Friday, July 17, 2015

షుగర్ పేషంట్లు కాఫీ తాగేయవచ్చు?

కాఫీ తాగాలని ఉంది. కానీ షుగర్ పేషంటు.. తాగుదామంటే ఎక్కడ షుగర్ ఎక్కువ అవుతుందోననే భయం.. అలాగే స్థూలకాయం వచ్చేస్తుందేమోనని ఆందోళన. ఇక ఒబెసిటీ ఉన్నవారు, మధుమేహ వ్యాధిగ్రస్తులు భయపడాల్సిన పని లేదు. కాఫీ తాగేవచ్చు... పరిశోధకులు ఈ మాట చెబుతున్నారు.. అదెలా..?
 
మధుమేహం, స్థూలకాయం వంటి దీర్ఘకాలిక రుగ్మతలపై ఎలాంటి ప్రభావం చూపదని యూనివర్సిటీ ఆఫ్‌ కోపెన్‌హాగన్‌ పరిశోధకులు చెబుతున్నారు. దీర్ఘకాలిక వ్యాధులుండి, కాఫీ తాగే అలవాటున్న 93వేల మంది డీఎన్‌ఏపై అధ్యయనాన్ని చేశారు. ప్రధానంగా కాఫీ తాగాలనే కోరిక కలిగించే జన్యువులను నిశితంగా పరీక్షించారు. 
 
మిగతావారి కంటే కాఫీ ఎక్కువగా తాగే వారిలో ఆ కోరికను కలిగించే జన్యువులు ఎక్కువగా ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు. అయితే ఈ జన్యువులు మధుమేహం, స్థూలకాయాన్ని కలిగించవని తేలింది.
 


0 comments:

Post a Comment