వెర్రి వేయి విధాలు.. పిచ్చి ముదిరి తలకు రోకలి చుట్టుకోవడం అంటే
ఇలాగేనేమో! స్మార్ట్ ఫోన్స్ హవా స్టార్ట్ అయ్యాక సెల్ఫీల పిచ్చి
ప్రపంచవ్యాప్తంగా ముదిరిపోయింది. ఒబామా, నరేంద్రమోదీ వంటి నేతలు సైతం
సెల్ఫీలకు అతీతులం కాదని నిరూపించారు. కానీ ప్రముఖులు ఎప్పుడైనా అరుదుగా
ఇవి సోషల్ నెట్‌వర్క్స్‌లో పోస్ట్ చేస్తారు. కుర్రకారు లేదా సోషల్
నెట్‌వర్క్స్ మానియా ఉన్నవాళ్ళు రోజూ కనీసం ఐదారు సెల్ఫీలు తీయకుండా
నిద్రపోరని ఓ రిపోర్ట్ చెబుతోంది.
ఇక అసలు సెల్ఫీకి వస్తే.. అమెరికా- శాండియాగోలో ఓ ప్రబుద్ధుడు కోబ్రాతో
సెల్ఫీ దిగి దాదాపు కోటి రూపాయలు హాస్పిటల్ బిల్ కట్టడానికి రెడీ అయ్యాడు.
ఇంకానయం రెండు ఆసుపత్రిల్లో చేరి ఏదోవిధంగా బతికి బయటపడ్డాను అంతేచాలని
సంబరపడుతున్నాడట. చేతిమీద కోబ్రా కాటుకు రంగు మారిన చేయి ఫోటో ఇది!
హాస్పిటల్ బిల్ ఫోటో ట్విట్టర్‌లో పెట్టి మరీ ముచ్చట తీర్చుకున్నాడు.
అదీ
సంగతి. సెల్ఫీ కోసం సాహసాలు చేస్తే ఇలాంటి ప్రమాదాలే ఎదురవుతాయి.. యూత్
తస్మాత్ జాగ్రత్త!
0 comments:
Post a Comment