రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ ప్రభుత్వానికి పంటి
కింద రాయిలా తయారయ్యారు. పదునైన విమర్శలు.. ఇరుకున పెట్టే అంశాలతో కేసీఆర్
ను ఎప్పుడూ విమర్శిస్తూనే ఉండేవాడు. ఇది వారికి చాలా
ఇబ్బందికర అంశంగానే తయారయ్యింది. అందుకే ఆయనను అలా ఓటుకు నోటు కేసులో
ఇరికించేశారు. అదే వేరే విషయం కానీ, అప్పట్లో కూడా ఆయనకు ఓ బంపర్ ఆఫర్
ఇచ్చారట.. ఈ విషయం రేవంత్ రెడ్డే స్వయంగా చెప్పారు. ఏమిటా బంపర్ ఆఫర్..?
ఎవరిచ్చారు..?
ఆయా నేతల స్థాయిని బట్టి వారికి సరితూగే
నేతలను టీఆర్ఎస్ రంగంలోకి దించి బేరసారాలు ఆడుతుందిట. రేవంత్‌కు ఈ తరహా
ఆఫర్ చేసేందుకు తెలంగాణ మంత్రి, కేసీఆర్ మేనల్లుడు హరీశ్ రావు స్వయంగా
రంగంలోకి దిగారట. భవిష్యత్తుపై భరోసా.. పార్టీలో స్థానం.. మంత్రివర్గంలో
స్థానం.. ఇలాంటి ఎన్నో ఆఫర్లు ఆయన ముందుకు వచ్చాయి. కానీ వీటన్నింటికి
మించిన ఆఫర్ ఒకటి హరీశ్ రావు చేశారట.
ఆ ఆఫర్ ఏమిటి, తాను హరీశ్ రావుకు ఏం
చెప్పానన్న విషయాలను వెల్లడించేందుకు మాత్రం రేవంత్ రెడ్డి నిరాకరించారు.
ఇలాంటి విషయాలను బహిరంగంగా చర్చించేందుకు ఇష్టం లేదని ఆయన చెప్పుకొచ్చారు.
అవకాశం దొరికినప్పుడు తప్పనిసరిగా ఈ విషయాలను బహిర్గతం చేస్తానని కూడా
రేవంత్ రెడ్డి చెప్పారు. ‘ఏబీఎన్ ఆంధ్రజ్యోతి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రేవంత్
రెడ్డే స్వయంగా ఈ విషయం వెల్లడించారు.
0 comments:
Post a Comment