అతను బిచ్చగాడే... రోజూ మసీదుల వద్ద కింద కూర్చుని బిచ్చమెత్తుకుంటాడు. కాని, అతని వద్ద ఉన్నసొమ్మెంతో తెలుసా... అక్షరాలా రూ. 10 కోట్లు. ఈ విషయం తెలిసి పోలీసులు ఆశ్చర్యపోయారు. ఎక్కడ..? అతను ఎలా సంపాదించాడు..?
ఒక విదేశీయుడు కువైట్‌లో అడుక్కుంటూ పది
కోట్లు సంపాదించాడు. అతడు ఒక మసీదు దగ్గర బిచ్చమెత్తుతుండగా పోలీసులు
అరెస్టు చేశారు. విచారణ సందర్భంగా స్థానికంగా ఉన్న ఓ బ్యాంకులో రూ.10కోట్లు
దాచుకున్నట్లు బిచ్చగాడు చెప్పడంతో అధికారులు ఆశ్చర్యపోయారు.
కువైట్, బహ్రెయిన్, ఒమన్, ఖతార్, సౌదీ,
దుబాయ్ వంటి గల్ఫ్ దేశాలలో బిచ్చమెత్తడం నేరం. కొందరు విదేశీయులు దీన్నో
లాభసాటి వ్యాపారంలా భావిస్తున్నారని స్థానిక అధికారులు చెబుతున్నారు.
0 comments:
Post a Comment