CSS Drop Down Menu

Saturday, July 25, 2015

ఉదయభానుకు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిన చిరు, బాలయ్య ?

టేజిపైన ఉన్న హీరోలను వర్థమాన హీరోలు అనుకుందేమోగానీ యాంకర్ ఉదయభాను, అందరినీ వేసినట్లుగానే వారికీ ప్రశ్నలు వేసింది. ఇంతకీ ఆ వివరాలు ఏమిటంటే... టీవీ9, టీఎస్సార్ అవార్డు ఫంక్షనుకు యాంకర్ గా ఉదయభాను వ్యవహరించింది. ఈ అవార్డులను ఆయా విజేతలకు చిరంజీవి, బాలకృష్ణ ఇద్దరూ చెరో పక్క నిలబడి బహూకరించారు. ఉదయభాను అలా మాట్లాడుతూ ఉండగా చిరంజీవి స్టేజి పైకి వచ్చారు. ఆయన మైకు అందుకున్నారు. 

అంతలోనే ఉదయభాను మైకు పట్టుకుని నవ్వుతూ, సార్ మీ 150వ సినిమా ఎప్పుడో చెప్పండి అంటూ పుసుక్కున అనేసింది. ఆయన కోపాన్ని అదిమిపట్టుకున్నారో ఏమోగానీ, ఇది సందర్భం కాదని కాస్త గుడ్లురిమి చూశారు. అంతే హాట్ యాంకర్ సైలెంట్ అయింది. 
 
మళ్లీ ఇంతలోనే బాలయ్య మైకులో మాట్లాడుతున్నారు. ఆయన ఏదో చెప్పబోతుంటే... అదేమిటంటే అనుకుంటూ మధ్యలోనే దూరేసింది. మళ్లీ బాలయ్య కాస్త పెద్దగానే నేను చెపుతాగా ఆగు అని అన్నారు. అంతే, మారుమాట్లడకుండా సైలెంట్ కొద్దిసేపు సైలెంట్ మెయింటైన్ చేసింది. అదీ సంగతి. సీనియర్ హీరోలతో పెట్టుకుంటే ఇంతేమరి.
 


0 comments:

Post a Comment