ఒక తప్పు సాధారణ మహిళను అత్యంత ధనికురాలిగా చేసింది. కానీ ఈ నడమంత్రపు
సిరి ఆనందం కొద్దిసేపు మాత్రమే దక్కింది. తన అకౌంట్ అప్‌డేట్
చేసుకునేందుకు బ్యాంక్‌కు వెళ్లిన మహిళ తన ఖాతాలో 95,700 కోట్ల
రూపాయలుండటంతో ఆనందంతో పొంగిపోయింది. ముందు ఒకింత షాక్‌కు గురైన ఆ మహిళ ఈ
సంగతి బ్యాంక్ సిబ్బందికి తెలియజేయడంతో నాలుక్కరుచుకున్న బ్యాంకు అధికారులు
సర్వర్ ప్రాబ్లెమ్ వల్ల ఈ పొరబాటు జరిగిందంటూ సర్దుకున్నారు.
ఆసక్తి కలిగించే ఈ కథనం వివరాల్లోకి వెళితే.. ఊర్మిళ యాదవ్ అనే మహిళ నెలకు
3,000 రూపాయల ఆదాయం సంపాదించుకునే సాధారణ మహిళ. తన సొమ్మును 'స్టేట్
బ్యాంక్ ఆఫ్ ఇండియా' కాన్పూర్ బ్రాంచ్‌లోని సేవింగ్స్ అకౌంట్‌లో
దాచుకుంది. అయితే ఆదివారం తన సేవింగ్స్ అక్కౌంట్‌ను అప్‌డేట్ చేసుకునేందుకు
బ్యాంక్‌కు వెళ్లింది. సేవింగ్స్ ఖాతాలో 95,700 కోట్ల రూపాయలు తన పేరిట జమ
అయినట్టు చూసి ముందు బిత్తర పోయింది. తరువాత ఆనంద పడింది. కాసేపటి తరువాత
తేరుకుని ఇదే విషయాన్ని బ్యాంక్ సిబ్బందికి తెలియచేసింది. దీంతో ఖంగారు
పడ్డ సిబ్బంది ఎస్‌బిఐ అధికారులకు తెలియజేయడంతో వాళ్ళు అప్రమత్తమయ్యారు.
సాంకేతికలోపమే ఈ పొరబాటుకు కారణమనీ, బ్యాంక్ మెయిన్ సర్వర్ ముంబైలో ఉండటంతో
సాధ్యమైనంత త్వరలో దీనిని క్రమబద్దీకరిస్తామని సంజాయిషీ ఇచ్చుకున్నారు.
0 comments:
Post a Comment