CSS Drop Down Menu

Friday, February 13, 2015

"కూతురిని వ్యభిచారంలోకి" దించేందుకు ప్రయత్నిస్తున్న "నటి"

సినిమా వెండితెరపై ఛాన్సులు వచ్చినన్నాళ్లూ వెలిగిపోయిన కొందరు తారలు, ఆ ఛాన్సులు కనుమరుగవగానే పక్కదారి పడుతున్నారు. ముఖ్యంగా నటీమణలు కొందరు వ్యభిచారం వృత్తిని స్వీకరించడం, పోలీసులకు పట్టుబడటం జరుగుతూ ఉంటోంది. తాజాగా మరో ఘటన వెలుగుచూసింది. 
 
చెన్నైలోని వడపళనిలో కన్న కూతురిని వ్యభిచారంలోకి దించేందుకు ప్రయత్నిస్తున్న తమిళ నటి రాజేశ్వరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ నటి తన కుమార్తెను వ్యభిచారం రొంపిలో దించేందుకు ఓ నక్షత్ర హోటల్ కు తీసుకెళ్లింది. ఐతే పోలీసులు పక్కా సమాచారంతో ఆ హోటల్ పై దాడి చేసి ఆమె ప్రయత్నాన్ని అడ్డుకున్నారు.
 
14 ఏళ్లున్న తన కుమార్తెను నటి రాజేశ్వరి వ్యభిచారంలో దించేందుకు మరో వ్యక్తితో కలిసి ప్రయత్నం చేసింది. ఐతే పోలీసులు ఆమెతోపాటు సహకరిస్తున్న ఆ వ్యక్తిని కూడా అరెస్టు చేశారు. కాగా రాజేశ్వరి కెరీర్ తొలినాళ్లలో మంచి ఆఫర్లు వచ్చాయనీ, కానీ ఆ తర్వాత ఆఫర్లు మందగించడంతో జీవితం గడవడం కష్టమైపోయిందంటున్నారు. అందువల్లనే ఈ దారిని ఎంచుకుని ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.
 

0 comments:

Post a Comment