రామ్‌గోపాల్ వర్మ రోజూ ఏదో విషయంలో వుంటూ
వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతూనే వుంటాడు. ఖాళీగా వున్నాడేమో ప్రతి
సినిమాపైనా, హీరోలపై కామెంట్లు చేస్తునే వున్నాడు.
రామ్ గోపాల్ వర్మ తాజాగా టెంపర్ ట్వీట్‌తో
వార్తల్లోకెక్కాడు. ఒకర్ని పొగడాలంటే ఇంకొకర్ని తిట్టాలనే టైప్‌లో తనకు
తోచింది చేసుకుంటూపోయే రామ్ గోపాల్ వర్మ ఈసారి ఏకంగా స్వర్గీయ ఎన్టీఆర్‌ని
సీన్‌లోకి లాగాడు.
జూనియర్ ఎన్టీఆర్ కొత్త సినిమా టెంపర్ పైన
హైప్ క్రియేట్ చేద్దామనుకున్నాడో ఏమో కాని తన తలతిక్క ట్వీట్‌లతో
పిచ్చెక్కించాడు. మొన్న పవన్ కల్యాణ్, నిన్న చిరంజీవి 150వ సినిమాపై
వ్యాఖ్యలు చేసిన రామ్ గోపాల్ వర్న ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్‌పై పడ్డాడు.
నేను పెద్ద ఎన్టీఆర్‌కి గొప్ప అభిమానిని,
జూనియర్ నాకు నచ్చేవాడు కాదు. కానీ టెంపర్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ నటన
చూశాక సీన్ మారింది.
టెంపర్ చూశాక ఏమనిపిస్తుందంటే.. ఎన్టీఆర్
మళ్లీ వచ్చి జూనియర్ ఎన్టీఆర్ నుంచి చాలా విషయాలు నేర్చుకోవాలి. ఒక వేళ
జూనియర్, సీనియర్ ఎన్టీఆర్ కంటే ముందు పుట్టి ఉంటే ఆయన కన్నా చాలా పెద్ద
స్టార్ అయ్యుండేవాడు.
నేను థియేటర్‌కి చాలా తక్కువగా వెళ్తుంటా,
నేను భ్రమరాంభ థియేటర్‌లో ఈ నెల 13న టెంపర్ సినిమాకు వెళ్తున్నా. నిజంగా
ఆత్మలుంటే భ్రమరాంభ థియేటర్‌లో ఈ నెల 13న సీనియర్ ఎన్టీఆర్ ఈ ఆత్మ ఈ సినిమా
చూడటానికి రావాలి రాలేదంటే ఆయన తారక్‌ను చూసి అసూయ పడుతున్నట్లే లెక్క.
నిజాయితీగా చెబుతున్నా.. జూనియర్ ఎన్టీఆర్‌తో పోలీస్తే సీనియర్ ఎన్టీఆర్
పెద్ద జీరో అని నామనసుకు అనిపిస్తుంది.
అడవి రాముడు 17 సార్లు చూశా.. టెంపర్
27సార్లు చూడాలనిపిస్తుంది. టెంపర్ తరువాత ఎన్టీఆర్ వంశం జూనియర్
ఎన్టీఆర్‌కు ముందు జూనియర్ ఎన్టీఆర్‌కు తర్వాత అని చెప్పుకోవాల్సి ఉంటుంది.
సీనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఏమీ బాధపడవలసిన అవసరం లేదు ఎందుకంటే నేనే
ఆయనకు అతి పెద్ద అభిమానిని. తారక్‌ను టెంపర్ సినిమాలో చూశాక ఉద్వేగం
ఆపుకోలేక ఇలా మాట్లాడుతున్నా అని ముగించాడు. అయితే, ఇదంతా ఎన్‌టిఆర్ కోసం ఖర్చీఫ్ వేస్తున్నాడంటూ ఫిలింనగర్‌లో వార్తలు విన్పిస్తున్నాయి.
ఇటీవల అస్సలు వర్మ సినిమాలు చూసి జనాలు
థియేటర్లకు రావాలంటే భయపడుతున్నారు. ఐస్‌క్రీమ్-2 అంటూ తీశాడు. కానీ
బిజినెస్ కాక ఆగిపోయింది. రాజశేఖర్‌తో పట్టపగలు తీశాడు. ఐతే అది ఎంతవరకు
వచ్చిందో తెలియడంలేదు. ఈ నేపథ్యంలో ఎన్‌టిఆర్‌పై కన్ను పడింది. దాంతో తన
కెరీర్‌లో ఆయనతో సినిమా తీస్తే ఒక దారికి వస్తుందని ఫిలింనగర్‌లో కథనాలు
వినిపిస్తున్నాయి.
0 comments:
Post a Comment